తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిదానిని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై ఆపాదిస్తున్నారని విపక్ష నేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో నకిలీ మధ్యం అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వై.ఎస్.పేరు ప్రస్తావించారు.దీనిపై జగన్ స్పందిస్తూ, వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి అయిదేళ్లు అయినా ప్రతి విషయానికి ఆయన పేరు ఆపాదించటం టీడీపీకి అలవాటు అయిపోయిందని అన్నారు.. 'వైఎస్ఆర్ చనిపోయి అయిదు సంవత్సరాలుపైన అయ్యింది... ఎన్నికలు జరిగి ముడు నెలలు అయ్యింది. ఈ మూడు నెలల్లో జరిగినవి కూడా వైఎస్ఆర్కే ఆపాదించటం టీడీపీకే చెల్లుతుందని' జగన్ ధ్వజమెత్తారు.కాగా నకిలీ మధ్యం కేసులపై సిబిఐ విచారణకు ప్రభుత్వం సిద్దపడుతుందా అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి సవాల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: