తెలంగాణ పోలీస్ ను న్యూయార్క్ పోలీసుల మాదిరిగా తయారు చేస్తామని, వారిలో వృత్తిపట్ల నిబద్దత పెంచుతామని, వారికి వారానికి ఒక్కరోజు సెలవు ఇవ్వడంతో పాటు, హైదరాబాద్ లో శాంతిభద్రతల విషయంలో ఏ మాత్రం రాజీపడే ముచ్చటలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ పోలీసులకు ఉన్న వివిధ సమస్యల మీద దృష్టి సారించి వారికి అవసరమయిన సదుపాయాలు కల్పించే ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో నేరాలను అరికట్టేందుకు, నగరం మీద పోలీసుల నిఘా పెంచేందుకు హైదరాబాద్ పోలీసులకు 100 ఇన్నోవా వాహనాలు, 300 మోటార్ సైకిళ్లను సమకూర్చారు. ఇటీవల నెక్లెస్ రోడ్ లో కేసీఆర్ స్వయంగా జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు. ఆ రోజే ట్యాంక్ బండ్ మీద ఓ వాహనం ప్రమాదానికి గురికాగా ..ఇప్పుడు ఉన్నవాహనాలను నడిపే నాధుడు లేడట. పోలీసుల కోసం తెచ్చిన వాహనాలు కొత్తగా వచ్చిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ గలవి. అందుకే ఈ వాహనాలను నడపడంలో పోలీసు శాఖలో ఉన్న డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారట. అందుకే ఇటీవల ఈ అత్యాధునిక వాహనాల మీద అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారట. అయితే అందులో 135 మంది పరీక్ష తప్పారట. వాహనాలు అయితే కొన్నారు గానీ ..వాటికి డ్రైవర్లు లేక ఇబ్బందులు పడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: