మెదక్‌ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో విజయం కోసం భాజపా తీవ్ర కసరత్తు చేస్తోంది. సాధారణ ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన భాజపా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం ఆరుగురు నేతలతో ప్రచార కమిటీని నియమించింది. సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ, శాసనసభలో భాజపా పక్ష నేత డాక్టర్‌ కె. లక్ష్మణ్‌, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, శాసనసభలో భాజపా పక్ష ఉప నేత చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కోశాధికారి జి. మనోహర్‌రెడ్డిలకు బాధ్యతలను అప్పగించారు. నియోజకవర్గంలోని ఏడు శాసనసభా నియోజకవర్గాలకు పార్టీ రాష్ట్ర నేతలను ఇన్‌చార్జీలుగా నియమించారు. పటాన్‌చెరు అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్యే ఎన్‌. ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్‌, మాజీ మంత్రులు పుష్పలీల, కమతం రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌ మల్లారెడ్డి, సంగారెడ్డి అసెంబ్లీ బాధ్యతలను మాజీ ఎమ్మె ల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆచారి, మాజీ ఎమ్మెల్యే ఎం. ఇందిర, సిద్దిపేటకు మాజీ ఎమ్మెల్యే జీ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, రాష్ట్ర కార్య దర్శి ప్రదీప్‌కుమార్‌, దుబ్బాకకు మాజీ ఎంపీ సీ జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎం. ధర్మారావు, కే ప్రతాప్‌రెడ్డి, వీ జయపాల్‌, వన్నాల శ్రీరాములు, చందాలింగయ్య దొర, రాష్ట్ర ఉపాధ్యక్షులు జీ ప్రేమేందర్‌రెడ్డి, నర్సాపూర్‌ అసెంబ్లీకి మాజీ ఎంపీ బంగా రు సుశీల, మాజీ మంత్రులు మేచినేని కిషన్‌రావు, పీ రామస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బద్దం బాల్‌రెడ్డి, ప్రేంసింగ్‌రాథోడ్‌, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు పీ చంద్రశేఖర్‌రావు, తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్‌ అల్జాపూర్‌ శ్రీనివాస్‌, జీహెచ్‌ఎంసీ అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి, మెదక్‌ అసెంబ్లీకి మాజీ మంత్రులు నేరెళ్ళ ఆంజనేయులు, అమర్‌సింగ్‌ తిలావత్‌, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, పార్టీ ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి వీ మురళీధర్‌గౌడ్‌, గజ్వేల్‌ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్సీ కే దిలీప్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, గుత్తా మోహన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లుకు బాధ్యతలను అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: