ప్రజా సంక్షేమాల అమలులో దేశానికే మార్గదర్శకంగా నిలిచిన దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మన నుంచి దూరమై నేటికి సరిగ్గా ఐదేళ్లైంది. ఈ నేపథ్యంలో ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణ యించింది.ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు నేతలు పిలుపునిచ్చారు. ప్రధానంగా వైఎస్సార్‌కు ప్రీతిపాత్రమైన సామాజిక సేవా కార్యక్రమాలను అత్యధికంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఇరు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్టస్థ్రాయి వరకు అన్ని రకాల కమిటీలు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రధానంగా రక్తదానంతో పాటు ఆ సుపత్రిలో వైద్యులకు పండ్లు, పలహారాలతో పాటు ఉచితంగా పేదలకు బట్టలు, విద్యార్థు లకు పుస్తకాలను భారీ ఎత్తున అందజేయాలని సూచించారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా రూ పకల్పన చేసిన అమలు చేసిన 108, ఆరోగ్య, సామాజిక, మహిళా పెన్షన్లతో పాటు విద్యా ర్థులకు ఫీజులు చెల్లింపు వంటివి విప్తవాత్మకమైన నిర్ణయాలని పార్టీ నేతలు కొనియాడుత తున్నారు.రెండోసారి సీఎంగా ఎన్నికైన వైఎస్సార్‌ దురదృష్టవశాత్తూ మృతి చెందారని ఆవే దన వ్యక్తం చేశారు. ఆయన మృతి చెందికుండా వుంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదని అభిప్రాయాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ప్రజలు రెండు రా ష్ట్రాలుగా విడిపోయ్యే వారు కాదని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో భారీగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. సామిజిక సేవా కార్యక్రమాలతో పాటు ప్రతి గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాలకు పూ లమాలలు వేసి ఘనంగా నివాళ్ళులర్పించాని సూచించారు. ఇందుకు రెండు తెలుగు రా ష్ట్రాల్లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు వైఎస్సార్‌ అభిమానులు సిద్ధ మయ్యారు.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ప్రతిప నాయకుడు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం ఇడుపు పాయకు చేరుకోనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైం దని పార్టీ వర్గాలు తెలిపాయి. దివంగత నేత వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఆయన ఇడుపుపాయకు చేరుకోనున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి వెంకట్రాది ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి మంగళవారం తెల్లవారుజామున ఎర్రకుంట్లకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. మంగళవారం ఉదయం తన తండ్రి దివంగత నేత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళ్లులర్పించడంతో పాటు అక్కడే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. నేడు మాజీ సిఎం వైఎస్సార్‌ వర్ధంతి ఆ తర్వాత తనకున్న సమయాన్ని బట్టి పులివెందుకు వెళ్లే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. తన ఒక్క రోజు పర్యటనను ముగించుకొని అక్కడ నుంచి తిరిగి మంగళవారం రాత్రికే హైదరాబాద్‌ కు బయలుదేరనున్నారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇరు రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఇడుపులపాయకు వచ్చే అవకాశం వుంది.దీంతో ఇందుకు తగినట్లుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపా యి. వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోనే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశా రు. ఇందులో పార్టీ నేతలు, కార్యకర్తలు, వైఎస్‌ఆర్‌ అభిమానులు భారీగా పాల్గొనాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఇందుకు సైతం తగిన ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: