ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్ణయం పై రాద్దాంతం ఏమిటని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. రాజధానిపై చర్చ జరపుతామని గతంలో హామీ ఇచ్చారని విపక్ష నేత సి.రామచంద్రయ్య ప్రశ్నించినప్పుడు రాజధానిపై క్యాబినెట్ లో చర్చ జరిగిందని,దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడతారని అన్నారు.దీనిపై రాద్దాంతం అవసరం లేదని అన్నారు.ఆ మీదట రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ,మండలిలో శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చర్చించడానికి మంత్రి నారాయణ ఒప్పుకున్నారని, ఇప్పుడు రాద్దాంతం అనడమేమిటని ప్రశ్నించారు.అంతకుముందు రామచంద్రయ్య, టిడిపి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి మధ్య కూడా రాజధానిపై వాగ్వాదం జరిగింది.రాజధాని అంటే మీ ఇంటి నిర్మాణం కాదని రామచంద్రయ్య పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: