బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాల్లోనే కాదూ సోషల్ మీడియాలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. రీసెంట్ గా ట్విట్టర్‌లో బిగ్ బీ ని ఫాలో అయ్యే వారి సంఖ్య కోటికి చేరింది. దేశంలో ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్న సెలేబ్రెటీ లలో అమితాబ్‌కే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్ బీ తర్వాత ప్లేసుల్లో బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్ (87లక్షలు), అమీర్‌ఖాన్ (81లక్షలు), సల్మాన్‌ఖాన్ (79లక్షలు), ప్రియాంక చోప్రా (68లక్షలు) ఉన్నారు. అమితాబ్ 2010 మేలో ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేశారు. ‘నా ట్విట్టర్‌లో కోటి మంది! నమ్మలేకున్నాను. అందరికీ థాంక్స్. నా నెక్స్ట్ టార్గెట్ రెండు కోట్లు!’ అంటూ అమితాబ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అమితాబ్ ప్రజెంట్ గా బల్కీ డైరెక్షన్ లో ‘షమితాబ్’ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: