హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నుండి పిలుపు రాగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరుగున వెళ్లిపోతున్నారు. ఆ మధ్య ఫలహారం బండి ఊరేగింపుకు ఇంటికి రావాలని కేసీఆర్ ను ఆహ్వానించాడు. దీంతో కేసీఆర్ వెంటనే రెఢీ అయిపోయి తలసాని ఇంటిముందు దిగిపోయాడు. ఆయన ఇచ్చిన విందును ఆరగించి వెనక్కివచ్చాడు. ఇక తాజాగా సోమవారం తన నియోజకవర్గంలోని ఐడీహెచ్ కాలనీ వాసులతో కలిసి కేసీఆర్ తో భేటీ వారి ఇబ్బందులు చెప్పగానే వెంటనే కేసీఆర్ ఆ కాలనీకి వెళ్లిపోయారు. వెల్లడమే కాదు ఆ కాలనీ వాసుల ఇళ్ళు కూలిపోయే దశకు చేరుకున్న నేపథ్యంలో వెంటనే స్పందించిన కేసీఆర్ ఐదు నెలలలో ప్రభుత్వమే వాటిని నిర్మించి ఇస్తుందని, ఐదు నెలల తరువాత మీరంతా కొత్త ఇళ్ళలో గృహప్రవేశం చేసినప్పుడు తనను పిలిచి భోజనం పెట్టాలని అడిగారు. దీంతో కాలనీ వాసులు కేసీఆర్ వరాలకు పొంగిపోయి సరేనని చెప్పేశారు. అసలు టీడీపీ ఎమ్మెల్యే పిలిస్తే కేసీఆర్ ఎందుకు అంతలా స్పందిస్తున్నారు అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే కేసీఆర్ సన్నిహితుడు, తెలంగాణ మంత్రి పద్మారావుకు టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీ నుండి శాసనసభా పక్ష నేత పదవి వస్తుందని తలసాని ఆశించాడు. అయితే చంద్రబాబు దానిని ఎర్రబెల్లికి ఇవ్వడంతో తలసాని టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ కార్యక్రమంలో చేరేందుకు సిద్దమయ్యాడు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం బారిన పడకుండా ఉండేందుకు తలసాని ఎక్కడా పార్టీ మారుతున్న వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు. మొత్తానికి తలసాని ఎపిసోడ్ ఎప్పుడు ముగుస్తుంది ? అన్నది వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: