అధికారంలో, రాజకీయంలో కీలకస్థాయిలో ఉన్న వ్యక్తులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏ మాత్రం వ్యవహారంలో తేడా వచ్చినా వారి పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడినట్లు అవుతుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష్మీపార్వతి జోక్యం మూలంగా ఏకంగా పదవీచ్యుతుడు అయి చివరి రోజుల్లో ఎంతో మానసికవేదన చెందిన మరణించారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఐదేళ్లలో చంద్రబాబు చేయాల్సినది ఎంతో ఉంది. ముఖ్యంగా నూతన రాజధాని నిర్మాణం విషయంలో ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఎంత ముందుకు వెళ్లగలిగి ..సీమాంధ్ర ప్రజలకు అంత భరోసా ఇవ్వగలిగితేనే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రజలు అంతగా అండగా నిలబడతారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే ఈ విషయంలోనే ఆయన ఎంతో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది కూడా. అందుకే పాలనలో ఇతరుల జోక్యాన్ని తగ్గించడం, తన తరపున ఇతర వ్యక్తులను కీలకం చేయడం వంటి పరిణామాలను చంద్రబాబు నివారించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాలలో ఇద్దరు వ్యక్తులు కీలకంగా మారుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కు సన్నిహితుడు అయిన అభీష్టకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కు లభిస్తున్న ప్రాధాన్యం మంత్రివర్గంతో పాటు, ఇతర ఐఎఎస్, ఐపీఎస్ లకు రుచించడం లేదట. లోకేష్ సన్నిహితుడు అయినందున అభీష్టకు ముఖ్యమంత్రి ఓఎస్డీ అయ్యారు. ఇటీవల పలువురు మంత్రుల పీఏలు, సహాయకులను మార్చడంలోను అభీష్ట జోక్యమే ఎక్కువగా ఉంది. ఇది మంత్రులకు, అధికారుకలు ఏ మాత్రం రుచించడం లేదట. నేరుగా వారు కేబినెట్ చర్చలలో పాల్గొనడం, దానికి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం ఉండడం క్రమంగా అసంతృప్తికి తెరలేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. .................

మరింత సమాచారం తెలుసుకోండి: