ఎన్నో ఆశలతో కాయకష్టం చేసి సాగు చేసుకున్న పంటలు వాడిపోతుంటే రైతుల గెండెల్లో మంటలు చెలరేగుతున్నా యి. మళ్లీ విత్తనాలు నాటినా పంటపై ఆశలు చిగురించక మనో నిబ్బరాన్ని కోల్పోతున్నారు. వెంటాడుతున్న అప్పుల భారాన్ని తీర్చే దారిలేక వచ్చని పోలాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక వైపు తీవ్ర వర్షాభావ పరిస్థితు లు, మరో వైపు కరెంట్‌ కోతలు పంటలపై ఆశలను వమ్ము చేశాయి. రుణ మాఫీ అమలు కాక, బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వక పోవడంతో అధిక వడ్డీల కు ప్రైవేట్‌ వ్యక్తులపై ఆధారపడాల్సిన పరిస్థితులు రైతులను మరింత కుంగ దీస్తున్నాయి.తెలంగాణ జిల్లాల్లో అధిక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. మొక్క జోన్న,పత్తి ,వరి ఏ పంట సాగు చేసినా రైతుకు మాత్రం కన్నీటి కష్టాలే.. తీసుకున్న అప్పులు ఏ విధంగా చెల్లించాలో, పిల్లలను ఏ విధంగా చదించుకోవాలో అర్దం కావడం లేదు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ వ్యవసాయంతో పాటు అన్నీ తానై చూసుకుంటున్న కుటంబ పెద్దలు ఆత్మహత్యలు చేసుకోవడంతో ఆ కుటుంబాల్లోని మహిళల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.కొన్ని చోట్ల కౌలు ధరలు కూడా అమాతంగా పెరిగాయి, గత ఏడాది ఎకరాలకు రూ.5 వేల నుంచి ఆరు వేల వరకు ఉంటే ఈ ఏడాది రూ.10 వేల నుంచి 12 వేల వ రకు పెంచారు. అది కూడా ముందుగానే చెల్లించాల్సి వచ్చింది. పంట పోయింది, ఇటు కౌలు, అటు పెట్టుడి కోసం తెచ్చిన లక్షల రూపాయలు ఖర్చు అయిపోయి రైతులు అప్పులు పాలై పోయారు. ఇక పోతే నల్లరేగడి భూములకైతే రూ.14 వేలు తీసుకుంటున్నారు. ఆసగు చేసుకుంటే తమ జీవితాలు కొంతైనా బాగుపడుతాయని ఆశిస్తే చివరకు వారు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని వరంగల్‌ జిల్లా చేర్యాలకు చెందిన రైతులు వాపోయారు. బ్యాంకు రుణాల మాఫీ సకాలంలో అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర కష్టాల్లో పడ్డారు. దీనికి తోడు వర్షాభావంతో పంటలను ఒకటి రెండు సార్లు వేయాల్సిన రావడంతో ఏ మాత్రం వెసులుబాటు లేని పరిస్థితి ఏర్పడింది. తమ బకాయిలను చెల్లిసేనే మళ్ళీ రుణాలిస్తామని బ్యాంకులు చెబుతుండటంతో పంటల పెట్టబడికి వడ్డీ వ్యాపారులే దిక్కుయ్యారు. 80 శాతానికి పైగా రైతులు వడ్డీ వ్యాపారులకు, షావుకారుల మీద ఆధార పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. విత్తనాలు, ఎరువుల,పురుగుమందులు, వంటి వన్ని ఒకే షాపులో తీసుకుంటాం పంట కూడా ఆయనే తీసుకుంటాడు బాకీ పోను మిగిలితే ఇస్తారు. పంట వస్తే రూ.2 లు వడ్డీ తీసుకుంటారు లేక పోతే రూ.3 తీసుకుంటారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొన్ని చోట్ల రైతులు వరి, మొక్క జోన్న పంటలపై ఆశలు వదులుకుని పశువుల మేతకు వదిలేశారు. వర్షాభావంతో పూర్తిగా ఎండిపోవడంతో ఇక చేసేదేమి లేక పశువులను మేపుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: