అదృష్టంలో దురదృష్టం అంటే టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి నేతలదే. పాపం పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చొని పార్టీని కాపాడుకుంటూ రాజకీయాల్లో కొనసాగినా.. చివరకు ఫలితం అందే సమయానికి దురదృష్టం వెక్కిరించింది. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చేసరికి.. అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడి.. రాజకీయంగా దెబ్బతిన్నారు. గెలిస్తే కచ్చితంగా మంత్రిపదవి దక్కే నేతల్లో నెల్లూరు నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకరు. సోమిరెడ్డితో పాటు మరో నేత పయ్యావుల కేశవ్ దీ అదే పరిస్థితి. కాలం కలసి రాకపోవడమంటే ఇదే. సీనియర్ నేత సోమిరెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఎక్స్ పార్టీ స్పార్టీ వాళ్లని ఏకేయడంతో దిట్ట. ప్రత్యేకించి ఆయన జగన్ విషయంలో ఘాటుగా విమర్శలు చేయగలరు. టీడీపీలో ఇలా ఒక్కో విషయానికి ఒక్కో ఎక్స్ పర్ట్ ఉంటారు. సోమిరెడ్డి జగన్ స్పెషలిస్టన్నమాట. ఎన్నికల్లో ఓటమితో పాపం ఆయన్ను మీడియా కూడా పెద్గగా పట్టించుకోవడం మానేసింది. నెల్లూరు లాంటి చోట్ల ప్రెస్ మీట్లు పెట్టినా పెద్దగా ప్రాచుర్యం రావడం లేదు. దాంతో ఇక తప్పదనుకుని ఆయన నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చి.. పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టి వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా బుధవారం కూడా ఆయన విపక్ష నేత జగన్ పై నిప్పులు చెరిగారు. ఇందూ ప్రాజెక్టుల విషయంలో సీబీఐ మరో చార్జ్ష్ షీటు దాఖలు చేయడంతో సోమిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఇన్ని కేసులు, చార్జ్ షీట్లు ఉన్న వ్యక్తి అసలు.. విపక్షనేత స్థానానికే తగిన వాడు కాదని జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ ఆ స్థానం నుంచి దిగిపోయి.. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య, ఎన్టీఆర్, చంద్రబాబు వంటి నేతలు నిర్వహించిన ప్రతిపక్షనేత స్థానానికి ఆర్థిక నేరగాడైన జగన్ ఏమాత్రం సరిపోడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చార్జ్ షీట్ల విషయంలో జగన్ గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదిస్తారని ఎద్దేవా చేశారు. మరి ఈ రేంజ్ లో కష్టపడుతున్న ఈ దురదృష్టనేతకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు ఏ పదవితో సరి చేస్తారో..

మరింత సమాచారం తెలుసుకోండి: