మీకు జీమెయిల్ లో ఆకౌంట్ ఉందా? అది సురక్షితంగా ఉందని భావిస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్..! జీమెయిల్ అకౌంట్లకు సంబంధించి దాదాపు 50 లక్షల వరకు యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు లీకయ్యాయని ఓ యూజర్ చెబుతున్నాడు. అవన్నీ ఆన్లైన్లోకి వెళ్లిపోయాయని సదరు యూజర్ పేర్కొన్నాడు. మొత్తం 49.3 లక్షల యూజర్ ఐడీలు, పాస్వర్డ్లతో కూడిన డేటా బేస్ రష్యాకు చెందిన బిట్కాయిన్ అనే సెక్యూరిటీ ఫోరంలో పోస్ట్ అయిందట. గూగుల్ జీమెయిల్ ఐడీ ఉన్నవారి వివరాల్లో 60 శాతం వరకు లాగిన్ వివరాలు లీకయ్యాయని అతను పేర్కొన్నాడు.  కాగా, గూగుల్ మాత్రం తమ నుంచి సులువుగా వివరాలు లీకయ్యే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ పాస్వర్డ్లు లీకైనట్లు అనుమానం ఉంటే తక్షణం పాస్ వర్డ్ మార్చుకోవాలని సూచిస్తోంది. అయినా, హ్యాకర్ల అనుమానం ఉంటే క్లిష్టమైన పాస్ వర్డ్ ఎంపిక చేసుకుని వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: