ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. 65 వేల సీట్ల భర్తీ కోసం రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతివ్వా లంటూ ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు త్రోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన షెడ్యూల్‌లోనే కొనసాగించాలని స్పష్టంచే సింది. సకాలంలో కౌన్సెలింగ్‌ ఎందుకు పూర్తి చేయలేదంటూ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ముఖోపాధ్యాయ ప్రశ్నించారు. ఆగస్టు 31లోపు కౌన్సెలింగ్‌ పూర్తిచేసి తరగతులు ప్రారంభించాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఎపి ఉన్నత విద్యామం డలిని ఆదేశించింది. ఈ ఆ ఆదేశం మేరకు కౌన్సెలింగ్‌ను పూర్తిచేసి తరగతులు ప్రారంభించింది.  అయితే 65 వేలకుపైగా సీట్లు మిగిలిపోయాయి. వీటి భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నత విద్యామండలి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ముఖోపాధ్యాయ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ విచారణ నిర్వహించింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఎఐసిటిఈ)కి ఫిర్యాదు చేస్తామన్న ఉన్నత విద్యామండలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఐసిటిఈ ద్వారా బి కేటగిరి ఖాళీలు భర్తీ చేసేందుకు అనుమతివ్వాలని ఉన్నత విద్యామండలి కోరగా తాము అను మతి ఇవ్వకుండా ఎఐసిటిఈ ఎలా అంగీ కరిస్తుందంటూ ధర్మాసనం ఆగ్రహించింది. సకాలంలో కౌన్సెలింగ్‌ ఎందుకు పూర్తి చేయలేదని సుప్రీంకోర్టు ఘాటుగా ప్రశ్నిం చింది. గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ను కొన సాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: