కేంద్ర పన్నుల ఆదాయంలో భారీగా వాటా వస్తుందని ఆశిస్తోన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఆశపై కేంద్రం నీళ్లు చల్లేందుకే సిద్ధమవుతున్నట్లు తెలియవచ్చింది. కేంద్ర పన్నుల ఆదాయంలో వాటాను పెంచాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిపట్ల కేంద్రప్రభుత్వం అంతగా సుముఖత కనపరచడం లేదు. ప్రధానంగా గ్రాంటులు, ఏకీకృత పన్నుల విధానం తదితర అంశాలతోపాటు ప్రధానంగా రాషా్టల్ర నుండి కేంద్రానికి వస్తున్న పన్నుల వాటాపై ఢిల్లీలో బుధవారం 14వ ఆర్థిక సంఘం అన్ని రాషా్టల్ర ఆర్థిక శాఖ మంత్రులతో సమావేశం నిర్వహిం చింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుండి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృ ష్ణుడు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాషా్టల్ర నుండి కేంద్రప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ మొత్తంలో ఆదాయం లభిస్తోందని, ఈ దృష్టా్య రాషా్టల్ర వాటాను పెంచాలని ఈ సమావేశంలో రెండు రాషా్టల్ర ఆర్థిక శాఖ మంత్రులు కేంద్రాన్ని కోరడంతోపాటు వాటికి సంబంధించి వినతి పత్రాలను కూడా సమర్పించారు. అయితే ఇందుకు కేంద్రం సుముఖత కనపరచ లేదని సమాచారం. ఇప్పటికే కేంద్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాషా్టల్ర నుండి వస్తున్న పన్నుల అదాయంలో 40 శాతం వాటాను ఇవ్వాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు గత కొంతకాలంగా కేంద్రాన్ని కోరుతు న్నాయి. ఈ నేపథ్యంలో పన్నుల ఆదాయంలో రాష్ట్ర వాటాను పెంచుతుందని ఆశతో ఎదురుచూసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు తీవ్ర నిరాశ ఎదురు కాక తప్పేటట్లు కనిపించడం లేదు.కాగా గత ఐదేళ్లుగా ఉమ్మడి రాషా్టన్రికి కేంద్ర పన్నుల వాటాలో సగటున 25 నుండి 28 శాతం వరకూ రాష్ట్రానికి ఆదాయం సమకూరుతోందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్లలకు చెందిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారవర్గాలు వెళ్లడిస్తున్నాయి. ప్రతీ ఏడాదీ ఈ పన్నుల వసూళ్లలో పురోగతి చోటు చేసుకుని కేంద్రానికి అధిక మొత్తంలో ఆదాయం లభిస్తుండగా, దానికి తగినట్లుగా రాషా్టన్రికి ఇచ్చే వాటా సొమ్ములో మాత్రం పెరుగుదల ఉండడం లేదని ప్రభుత్వ ఉన్నతాధికారవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాషా్టల్ల్రో జీఎస్జీకి సంబంధించిన ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం కేంద్రం రాషా్టల్రపై క్రమేపీ వత్తిడి కూడా పెంచుతున్నట్లు సంబంధిత అధికారవర్గాలు వెల్లడిస్తు న్నాయి. ఏకీకృత పన్నుల విధానం పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాషా్టల్ల్రోని వివిధ విభాగాలపై వస్తున్న పన్నుల ఆదాయ పరిధిలో మరింత మందిని తీసుకువచ్చి అందుకు అనుగుణంగా పన్నుల ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు కేంద్రం సంబంధిత అధికారులపై వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ పన్నుల పెంపుదల విషయంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలరాష్ట్రాల్లో సంబంధిత అధికార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలియవచ్చింది. రాష్ట్రాల్లో  పన్నుల ఆదాయాన్ని భారీగ పెంచేలా చర్యలు చేపట్టాలని ఇన్‌కమ్‌టాక్‌‌స, సెంట్రల్‌ ఎకై్సజ్‌ టాక్‌‌స, సర్వీస్‌ టాక్‌‌స తదితర విభాగాల ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడ వుతోంది. ఈ పన్ను వివిధ దేశాల్లో వివిధ రకాల్లో అమలు జరుగుతోంది. పాకిస్తాన్‌లో ఒక శాతం, ఆస్ట్రేలియాలో 10 శాతం, జర్మనీలో 19 శాతం, ఫ్రాన్‌‌సలో 19.6 శాతం, కెనడాలో 5 శాతం, సింగపూర్‌లో 7 శాతం, జపాన్‌లో 5 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేస్తుండగా ఇండియాలో ఇది 16 నుండి 20 శాతం వరకూ వసూలు చేస్తున్నారు. ఉత్పత్తి రంగంలోని వివిధ వస్తువులపై విలువ ఆధారిత పన్ను కింద కేంద్రానికి ఆదాయం సమకూరుతోంది. అయితే పన్నుల ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు వీటన్నింటినీ ఏకీకృత పన్నుల విధానం కిందకు తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వస్తున్న పన్నుల ఆదాయం అందు లో రాష్ట్ర వాటా కింద కేంద్రం ఇస్తున్న నిధులను పరిశీలిస్తే సర్వీస్‌ టాక్‌‌స, కేంద్ర ఎకై్సజ్‌ పన్నులు, కస్టమ్‌‌స, ఆదాయపు పన్ను, వ్యాట్‌, కార్పొరేషన్‌ పన్ను తదితర వాటి ద్వారా 2013-14 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 75,000 కోట్ల రూపాయల ఆదాయం కేంద్రానికి లభించినట్లు అధికారవర్గాలు వెల్లడిస్తు న్నాయి. ఇందుకుగాను 27 శాతం చొప్పున 20,250 కోట్ల రూపాయలను ఉమ్మడి రాషా్టన్రికి వాటా వచ్చినట్లు అధికారవర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: