తెలంగాణలో అత్యధిక ఇళ్లలో టీవీలు, మొబైల్ ఫోన్స్ ఉన్నట్లు సర్వే వెల్లడిస్తోంది.తెలంగాణ ప్రభుత్వం గత నెలలో నిర్వహించిన సర్వే విశేషాలు మీడియాలో వస్తున్నాయి. ఒక కధనం ప్రకారం తెలంగాణలో గత జనాబా లెక్కల ప్రకారం 58.8 శాతం మందికి టీవీలు ఉన్నట్లు వెల్లడికాగా,అవి ఇప్పుడు డెబ్బై శాతానికి పెరగడం విశేషం.అలాగే మొబైల్ ఫోన్ లు కూడా ఏబై నాలుగు వాతం మందికి గతంలో ఉండగా, ఇప్పుడు అవి డెబ్బై శాతం మందికి అందుబాటులోకి వచ్చాయి.అయితే లాండ్ లైన్ ఫోన్ లు మాత్రం 3.1 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గాయి.కాగా ఇంతకుముందు కుటుంబ సైజ్ 4.5 గా ఉండగా,తెలంగాణ సర్వేలో అది 3.2 గా ఉండడం ఒక పరిణామంగా కనిపిస్తుంది.సైకిళ్ల సంఖ్య ఇరవై ఐదు శాతానికి తగ్గగా, ద్విచక్ర వాహనాలు 28 శాతానికి, నాలుగు చక్రాల వాహనాలు 2.7 నుంచి ఐదు శాతానికి పెరిగాయి.అయితే ఆధార్ కార్డులు డెబ్బై లక్షల మందికి లేవని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: