ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాకు వూహించని మద్దతు లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు భాజపాకు ఒకసారి అవకాశమివ్వాలని కాంగ్రెస్‌ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ అన్నారు. షీలా దీక్షిత్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో పౌర ప్రభుత్వమే మేలని, ప్రజలతో ఎన్నుకున్నందున తద్వారా మేలు జరుగుతుందని అన్నారు. భాజపా ఆ పరిస్థితిలో ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు, ఇది ఢిల్లీ ప్రజలకు ఎంతో మంచిదని చెప్పారు. ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికలు కోరుకోవడం లేదని తెలుస్తోందన్నారు. భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వారే తమ ఆధిక్యతను నిరూపించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు ఆమె వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ విభేదించింది. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, కాంగ్రెస్‌కు సంబంధం లేదని పేర్కొంది.మరోవైపు షీలా దీక్షిత్‌ వ్యాఖ్యలతో ఆశ్చర్చపోయేదేమీ లేదని, భాజపా, కాంగ్రెస్‌ల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని ఆప్‌ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: