రాష్ర్టం విడిపోయిన తరు వాత మొదటిసారి రాజధాని వెలుపల ఆర్థిక ప్రణా ళికా సంఘం సమావేశం జరగడం కొంత బాధ కలి గిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తి రుపతిలో జరిగిన 14వ ఆర్థిక ప్రణాళికా సమావే శంలో విలేకరులకు వివరాలను తెలిపారు. చంద్ర బాబు నాయుడు మాట్లాడుతూ ఆ వేంకటేశ్వరుని పాదాలచెంద విడిపోయిన మన రాష్ర్ట అభివృద్ధి కో సం ఆర్థిక ప్రణాళికాసంఘ సమావేశం జరగడం కొంత బాధ కలిగిస్తోంది. కానీ ఆ దేవదేవుని పాదా లచెంత మొట్టమొదటి సమావేశం జరగడం మాన సికంగా సంతోషంగా ఉందన్నారు. ఆ వేంకటేశ్వరు ని ఆశీస్సుతో రాష్ర్టంలోని కష్టాలను తీర్చుకుంటా మన్న ధైర్యముందన్నారు. ఆర్టికల్‌ 280క్రింద ఉన్న నియమాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వా టాలను కేటాయిస్తుంది. మనకున్న ప్రణాళికా వివ రాలను మామూలుగా అయితే రాజధానిలో ప్రణా ళికా సంఘానికి తెలియజేయాలి. కానీ మనకు రా జధాని నగరమంటూ లేదు. హైదరాబాదులో తెలి యజేయడం, సమావేశం నిర్వహించడం అంత మ ంచిది కాదు. రాజధాని అనుకున్న విజయవాడలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున సమావేశం అక్కడ జరుపరాదు. అందుకనే తిరుపతిలో సమా వేశం నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌ రాజధానిగా ఉ మ్మడి రాష్ర్టంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ వార్షిక ఆదాయాన్ని 220 కోట్ల రూపాయలకు పెంచానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 2004కు ముందు నేను ముఖ్యమంత్రిగా ఉండగా 100 ఎరాలు తీసుకున్న రెహేజా గ్రూప్‌ సంస్థలు 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించా యి. వారివల్ల లక్షమందికి ఉద్యోగ అవకాశం కలి గింది. ఏవిధంగా అంటే 10వేలమంది ఉద్యోగ కుటుంబాలు హైదరాబాదులో స్థిరపడటం వల్ల కార్పొరేట్‌ హాస్పిటళ్లకు, మల్లీనేషనల్‌ రెస్టారెంట్లకు, మల్టీఫ్లెక్స్‌ థియేటర్లకు, షాపింగ్‌మాల్స్‌కు వీరి ఆధాయం వెల్లడం వల్ల అదనంగా లక్షమందికి ఉద్యోగభృతి కల్పించనట్లయింది. ఆ గణత తెలుగుదేశానికే దక్కింది. రాష్ర్టంలోని రాయలసీమ, కోస్తా, ఆంధ్ర జిల్లాలో తలసరి ఆదాయం వైజాగ్‌లో లక్షా ఇరవై వేల రూపాయలు, అదే శ్రీకాకుళంలో అయితే 63వేల రూపాయలు మ్త్రామే ఉంది.దానిని పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ర్టంలో డైరీఫారంలు, గొర్రెల పెంపకం, త్రాగు నీరు కొరకు వాటర్‌ గ్రిడ్‌, రిజర్వాయర్‌లలో నీటి నిల్వలు పెంచి గ్రామాలకు మంచి నీటిని సరఫరా చేయుటకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. అక్టోబర్‌ 2 నుండి నిరంతరం గృహాలకు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించబోతున్నాం. రైతులకు 7గంల నుండి 9 గంల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాం. పైపుల ద్వారా గ్యాస్‌లైన్‌లను గ్రామాలకు కనక్ట్‌ చేయబోతున్నాం. ఎల్‌.పి.జి. గ్యాస్‌ ద్వారా గృహాలకు, సీ.యన్‌.జి గ్యాస్‌ ద్వారా ఆటోమొబైల్‌ రంగానికి, యల్‌.యన్‌.జి. గ్యాస్‌ ద్వారా పరిశ్రమలకు గ్యాస్‌ను అందించబోతున్నాం. ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రకటించిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమాన్ని 3జి, 4జి ఆప్టిక్‌ కేబుల్‌ కనెక్టవిటీ ద్వారా గ్రామాలకు సైతం సమాచారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా అందించబోతున్నాం. పేదరికం పై గెలుపుకోసం నిరంతరం ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రణాళికా సంఘం ముందు రాష్ర్టంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమైన నీరుచెట్టు, బడి పిలుస్తోంది, పొలం పొలుస్తోంది రా !, దీపం కనక్షన్‌లు, యన్‌.టి.ఆర్‌. ఆరోగ్యసేవ, అన్నక్యాంటీన్‌లు, పరిసరాలుపరిశుభ్రత, పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌, వ్యక్తిగత మరుగుదొడ్లు, కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన నడిపిస్తామని వాటికి కావలసిన నిధులు సమకూర్చవలసిందిగా ప్రణాళికా సంఘాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇది ఇష్టంలేని విభజన. ఎక్కడా పారదర్శకత పాటించలేదు. 58 శాతం మంది ప్రజల మనోభావాలకు విరుద్ధంగా జరిగిన విభజనతో రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకుపోయింది. కానీ.. దీన్ని అవకాశంగా మలుచుకోవాలనుకుంటున్నాం. రాషాభివృద్ధిపై మాకు పక్కా ప్రణళికలు ఉన్నాయి. డబ్బే ప్రధాన సమస్య. రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులున్న రాజధాని, అక్కడి ఆర్థిక, ఉద్యోగ వనరులను కోల్ఫోయిన ఆంధ్రప్రదేశ్‌ను మీరు ప్రత్యేక దృష్టితో చూడాలి. రాషాన్ని పునాదుల నుంచి పునర్నిర్మించుకోవాల్సిన విషయాన్ని అర్థం చేసుకోవాలి అని ఏపీ మ్యుమంత్రి చంద్రబాబునాయుడు 14వ ఆర్థికసంఘాన్ని కోరారు. తిరుపతిలో శక్రవారం వైవీరెడ్డి నేతృత్వంలోని ఆర్థికసంఘంతో ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులు, వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులతో కలిసి సమావేశం జరిపారు. ఈ సందర్భంగా పాయింట్‌ ప్రంటేషన్‌ ద్వారా విభజనానంతర పరిస్థితిని వివరించి ఆర్థికసాయాన్ని కోరారు. ప్రపంచ స్థాయి రాజధానిని కోల్ఫోయాం. ఇప్ఫటిేక రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటును మోస్తున్నాం. రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో నిర్మించాలంటే ేకవలం ఈ లోటును భర్తీచేస్తే సరిపోదు. అభివృద్ధికి అవసరమైన మిగులు నిధులు ఉండేలా ప్రత్యేక అవార్డు ప్రకటించాలి. మాకు మద్దతిస్తే మేం అయిదుపదేళ్లలో వాటి ప్రతిఫలాలను జాతికి తిరిగి చెల్లిస్తాం. ఆంధ్రప్రదేశ్‌కు చేయూతను ఇవ్వడమంటే జాతి నిర్మాణనికి సాయపడటమే. అందుేక సంక్షోభంలో చిక్కుకున్న రాషానికి ప్రత్యేక హోదా ఇవ్వండి. రాజధాని నిర్మాణనికి రూ.లక్ష కోట్లు సిఫార్సు చేయండి. వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి పాే్యకజీలు ప్రకటించండి అని చంద్రబాబు విన్నవించారు. 1995-2004 మధ్య తన పాలన కాలంలో మహిళాభివృద్ధి, విద్య, కుటుంబ నియంత్రణలకు ప్రాధాన్యమిచ్చి ఆర్థిక సంస్కరణల అమలు ద్వారా సంపద సృష్టికి తాను తీసుకున్న చర్యలను చంద్రబాబు వివరించారు. 2029 నాటికి అన్ని రంగాల్లో దేశంలో నెంబర్‌వన రాష్ట్రంగా నిలబెట్టడమే తన లక్ష్యమని చంద్రబాబు ఆర్థికసంఘానికి స్ఫష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీని అభివృద్ధి పట్టాల మీదికి ఎక్కించి సామాజిక, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తాం. మౌలిక వసతులు, పారిశ్రామికాభివృద్ధికి శక్తినిస్తాం. రాయలసీమను కరవురహితంగా మార్చి మిగతా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తాం. దారిద్య్ర నిర్మూలన, సామాజిక సాధికారత సాధించడమే ప్రథమ కర్తవ్యం. దేశం 75వ స్వాతంత్య్ర దినం జరుపుకొనే 2022 నాటికి ఏపీని దేశంలోని తొలి మూడు రాషాల్లో ఒకటిగా నిలబెట్టి, 2029 నాటికి దేశంలో తొలి రాష్ట్రంగా మలచడమే మా లక్ష్యం. ఇందుకు మూడు సార్వత్రిక ఎన్నికలు, మూడు ఆర్థికసంఘాలను ముడిపెడుతున్నాం అని చంద్రబాబు ప్రకటించారు. అంతకుముందు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణడు ఆర్థికసంఘం సభ్యులు తమ రంగాల్లో చేసిన సేవలను కొనియాడుతూ స్వాగతోపన్యాసం చేశారు. అయిదేళ్ల లక్ష్యలివే ------------------- మాతృ మరణలను 990 నుంచి 450కి తగ్గించడం 5-16 ఏళ్లలోపున్న 81 లక్షల మంది పిల్లలకు అత్యున్నత ప్రమాణలతో కూడిన ప్రాథమిక విద్య అందించడం 16-24 ఏళ్లలోపు 50 లక్షలమంది యువకులకు ఉద్యోగాలు సంపాదించుకొనే విధంగా నైపుణ్య శిక్షణ అందించడం. 100 శాతం అక్షరాస్యత సాధించడం స్వయం సహాయక సంఘాల్లో కోటిమందిని సభ్యులుగా చేర్చడం. వచ్చే అయిదేళ్లలో వారికి రూ.లక్ష మూలధనం/బ్యాంకు రుణం సమకూర్చడం రాష్ట్రంలోని 33 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలపై వచ్చే అయిదేళ్లలో తలసరి రూ.లక్ష పెట్టుబడి పెట్టడం. ఏడు మిషన్లు, అయిదు గ్రిడ్లు, అయిదు ప్రచారోద్యమాలే ప్రధాన పరిపాలన లక్ష్యాలు 1.అసంఘటిత రంగం చేయూతకు ప్రాథమిక రంగాల అభివృద్ధి, కరవు నివారణ 2. వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి పోర్టు ఆధారిత వృద్ధి, సేవారంగాల విస్తృతే అంతిమ మార్గం 3.ప్రస్తుతం రూ.85,709గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదయాన్ని 2018-19నాటికి రూ.2 లక్షలకు తీసుెకళ్లడం 4. రాష్ట్ర స్థూల ఉత్ఫత్తిని రూ.4.75 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్లకు చేర్చడం ఇప్పటికే 16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్న ఆంధ్రరాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ప్రణాళికా సంఘాన్ని కోరగా ప్రణాళికా సంఘం అధ్యక్షులు స్పందిస్తూ గతంలో మీరు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను అంచనా వేశామని మీకు కావలసిన నిధులను అన్ని రాష్ట్రాలకంటే అదనంగా సమకూరుస్తామని హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దశలవారీగా రాజధాని నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందిస్తామని ప్రణాళికా సంఘం సభ్యులు తెలియజేసినట్లు విలేకరులకు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ర్ట సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఆర్థిక నిపుణులు రమేష్‌, రాష్ర్ట కన్సల్టెంట్‌ సి.యస్‌.రావు, మంత్రులు ఎనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాస్‌, పత్తిపాటి పుల్లారావు, రావిళ్ల కిషోర్‌ బాబు, గోపాలకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్‌ మేడామల్లికార్జున్‌రెడ్డి, పార్లమెంటు సభ్యుడు డా శివప్రసాద్‌, శాసనసభ్యులు సత్యప్రభ, వెంకటరమణ, ఆదిత్య, శంకర్‌, మాజీ శాసనసభ్యుడు యస్‌.సి.వి. నాయుడు పాల్గొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: