తమకు యూజర్ల డేటా ఇవ్వకపోతే రోజుకు రూ. 1.5 కోట్ల ఫైన్ వేస్తామని అమెరికా ప్రభుత్వం తమను హెచ్చరించినట్లు ఇంటర్నెట్ దిగ్గజం యాహూ చెప్పింది. అమెరికా రహస్య నిఘా కార్యక్రమం ‘ప్రిజమ్’ కోసం డేటా ఇవ్వాలని బెదిరించిందని ఆరోపించింది. దీనిపై యాహూ కోర్టుకు వెళ్ళింది. అయితే కోర్టు యాహూకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీంతో 1500 పేజీల అమెరికా యూజర్ల డాటాను నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ కి ఇవ్వాల్సి వచ్చిందని యాహూ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అమెరికా చట్ట విరుద్ధంగా చేస్తున్న నిఘా ప్రయత్నాలను అడ్డుకోవడానికి తాము చేస్తున్న పోరాటానికి ఇది నిదర్శనమని అన్నారు. ఆన్‌లైన్ యూజర్ల సమాచారాన్ని సేకరించేందుకు అమెరికా ప్రభుత్వం 2007లో ఓ కీలక చట్టంలో మార్పులు చేసిందని, అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి సహకరించేందుకు నిరాకరించామని చెప్పారు. ఈ నిఘా కార్యక్రమం కోసం పెద్ద మొత్తంలో యాహూ సంస్థతో పాటు, గుగూల్, ఫేస్ బుక్ వంటి అమెరికా కేంద్రంగా పనిచేసే సంస్థల యూజర్ డేటాను కలెక్ట్ చేయాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: