కలియుగంలో ఆంజనేయున్ని చూడాలనుకుంటున్నారా ? అయితే మీరేం వర్రీ కాకండి ఈ యుగంలో అందులోనూ 19 వ శతాబ్ధంలోనే ఆంజనిపుత్రుడు జన్మించాడు. ఎక్కడా అని ఆశ్చర్య పోతున్నారా ఇవిగోన్నండీ వివరాలు... రాజస్థాన్ లోని సికార్ పోస్టాఫీసుకు ఓ కవర్ వచ్చింది దానిపై వార్డు నెం -6, దంతారామ్ గఢ్, పంచాయతీ సమితి, సికార్ జిల్లా అని రాసి ఉంది. దీంతో ఆ పోస్టాఫీస్ సిబ్బంది కవర్ ను చించి చూడగా అందులో ఆధార్ కార్డు ఉంది దాన్ని చూసిన వారు ఒక్కసారి కిన్నులైనారు కారణం ఆ కార్డు పై ఉన్నది మరెవరో కాదు సాక్షాత్తు ఆంజనేయుడు బొమ్మ ఆయన వివరాలు... అంతేకాదు పేరుతో సహా పుట్టిన తేదీ అన్ని ఉన్నాయి. ‘హనుమాన్ జీ, సన్నాఫ్ పవన్ జీ’ అని కనిపించడంతో పోస్టల్ సిబ్బంది తలపట్టుకున్నారు. ఇప్పుడు ఆ కార్డు ఎవరికి ఇవ్వాలా ఆలోచనలో పడ్డారు. అయితే కార్డుపై ఉన్న మొబైల్ నెంబర్ కు డైల్ చేయగా అంకిత్ అనే వ్వక్తి లిఫ్ట్ చేశాడు అయితే ఆ కార్డుకు తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. దీంతో ఈ ఘనకార్యం అంతా ఆధార్ కార్డుల జారీ ఏజెన్సీ వారితే అని పోస్టల్ సిబ్బంది ఓ నిర్ణయానికి వచ్చారు. ఏదేమైనా ఈ వార్త ఆనోటాఈ నోటా విని వార్తల్లో కి ఎక్కి సంచలనమే సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: