కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇప్పుడు కారాలూ మిరియాలూ నూరుతున్నారు. మా పార్టీ అధినేత్రిని ఇంతగా అవమానిస్తావా నువ్వు? అంటూ వారు ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా రావడానికి ప్రత్యక్ష్యంగా, నువ్వు ముఖ్యమంత్రి పీఠంలో పరోక్షంగా కారణమైన మా మేడమ్ ను ఇంతగా అవమానిస్తావా? అంటూ వారు విరుచుకుపడుతున్నారు. ఇదంతా బతుకమ్మ పండగ విషయంలోని కోపం. తెలంగాణ వచ్చాకా తొలి బతుకమ్మను చాలా గ్రాండ్ గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లను కూడా చేస్తోంది. హైదరాబాద్ లోని పండగ నిర్వహించడానికే పది కోట్ల రూపాయలు ఖర్చు పెడతారట. దీనికి తోడు ఒక్కో జిల్లాకు పది లక్షల రూపాయలు ఇస్తూ పండగ ఏర్పాట్లు చేసుకొమ్మనదట ప్రభుత్వం. మరి ఇంత గ్రాండ్ గా నిర్వహిస్తున్న పండకు సెలబ్రిటీ హోదా కూడా ఉండాలి కదా.. అందుకే వివిధ రాష్ట్రాల మహిళా ముఖ్యమంత్రులకు, కేంద్ర క్యాబినెట్ లోని మహిళా మంత్రలకు, మహిళా గవర్నర్ లకు, ఇతర మహిళా ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది. ఇలా ఆహ్వానాలు పొందిన వాళ్లలో వివిధ పార్టీల నేతలున్నారు. ప్రాంతీయ పార్టీల అధినేతలు, టీఆర్ఎస్ వైరి పక్షంలోని పార్టీల ముఖ్యనేతలున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, బెంగాల్ సీఎం మమత, రాజస్థాన్ సీఎం వసుంధర, గుజరాత్ సీఎం ఆనందీబెన్ తో సహా కేంద్రమంత్రులు సుష్మా, స్మృతీ ఇరానీ , లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. మరి ఇలాంటి మహిళా ప్రముఖులందరినీ ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం కావాలనే మరిచిపోయిందో, లేక పొరపాటు కొద్దీ మరిచిపోయిందో కానీ సోనియాగాంధీని మాత్రం ఆహ్వానించలేదట. దీంతో కాంగ్రెస్ మహిళానేతలు మండి పడుతున్నారు. పార్టీలకు అతీతంగా అందరినీ పిలిచి సోనియాను మాత్రం ఎందుకు పిలవలేదు? అంటూ వీళ్లు కేసీఆర్ పై మండి పడుతున్నారు. ప్రత్యేక ప్రకటన విడుదల చేసి కేసీఆర్ తీరును తప్పుపడుతున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ తప్పు దిద్దుకొంటాడా?!

మరింత సమాచారం తెలుసుకోండి: