ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని ఇవ్వడానికి మంగళగిరి- గుంటూరు మధ్య ప్రాంతం రైతులు స్వచ్ఛందంగా ముందు కొచ్చారని రాజధాని నిర్మాణ కమిటీ ఛైర్మన్‌, పురపాలశాఖమంత్రి పి.నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణం నుంచి పూర్తి అయ్యేవరకు ఐఎఎస్‌ అధికారి నేతృత్వంలో రీజినల్‌ అథారి టీని నియమిస్తామన్నారు. ఈ అథారిటీ రాజ ధాని అభివృద్ధి, ప్రణాళిక కోసం స్వతం త్రంగా పనిచేస్తుందన్నారు. ఇబ్రహీంపట్నం, గుం టూరు, తెనాలి, గన్నవరం ప్రాంతాలను కలు పుతూ ఆరువేల ఎకరాల విస్తీర్ణంలో రింగ్‌రోడ్‌ నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. రాజధాని కోసం దాదాపు 12,500 ఎకరాల భూమి అవసరమవుతుందని, రైతులు ఎక్కడ భూమిని ఇవ్వడానికి ముందుకు వస్తారో, అక్కడ సచివాలయం, శాసనసభ వంటి ప్రాధాన్యత భవనాలను తొలివిడతగా నిర్మిస్తామన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో రైతుల వద్ద భూమి సేకరిస్తామని, అయితే, ల్యాండ్‌ పూలింగ్‌లో రైతులకు ఎంత భూమిని తిరిగి ఇవ్వాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. విజయవాడ ప్రాంతంలో ప్రభుత్వ భూమి తక్కువగా ఉంది కాబట్టి 75 శాతం భూమిని రైతుల వద్ద ల్యాండ్‌ పూలింగ్‌ చేసి మిగిలిన భూమిని సేకరిస్తామన్నారు. రాజధాని కోసం ఎంత వ్యవసాయ భూమి నష్టపోతే అంత రెట్టింపు భూమిని వ్యవసాయం కోసం అభివృద్ధి చేస్తామన్నారు. నేల స్వభావాన్ని బట్టి ఎన్ని అంతస్తుల్లో ప్రభుత్వ భనాలు నిర్మించాలో నిర్ణయిస్తామన్నారు. 250 అడుగుల వెడల్పుతో రహదారులను నిర్మించాల్సి ఉందన్నారు. రాజధాని కోసం సేకరించే అటవీ, రైతుల భూముల వివరాలు అందించాల్సిందిగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించామన్నారు. మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని నిర్మాణ అధ్యయన కమిటీ శనివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించింది. అనంతరం నారాయణ విలేకరులతో మాట్లాడుతూ పంజాజ్‌, హర్యానా రాష్ట్రాల రాజధాని చండీఘర్‌, గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌, చత్తీస్‌ఘర్‌ రాజధాని నయారారుపూర్‌ నగరాలను సందర్శించి రాజధాని నిర్మాణంపై వివిధ అంశాలను అధ్యయనం చేశామన్నారు. ఈ మూడు నగరాల్లో అనుకూల, ప్రతికూల అంశాలను పరిశీలించామని తెలిపారు. సచివాలయాలు, రహదార్లు, ప్రభుత్వ ఉద్యోగుల గృహసముదాయాలు, ఉద్యోగావకాశాలు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల తదితర అంశాలను క్షుణ్ణంగా తెలుసుకున్నామని చెప్పారు. 22 నుంచి 26వ తేదీ వరకు సింగపూర్‌, పుత్రజయ నగరాల్లో పర్యటిస్తామని, అలాగే వచ్చే నెల 5 నుంచి 9వ తేదీ వరకు చైనాలోని కుజో, షాంఘై నగరాలలో పర్యటిస్తామన్నారు. చండీఘర్‌ నగరాన్ని మంచి ప్రణాళికతో నిర్మించారని, ఆ నగరం మాదిరిగా కొత్త రాజధానిని నిర్మిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కాలుష్యరహిత రాజధాని నిర్మాణం కోసం ఐటి వంటి నాన్‌ పొల్యూషన్‌ కంపెనీలను ఏర్పాటు చేస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: