వరదలతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్ లో వారంరోజుల పాటు ఫ్రీ ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ తో ఆ రాష్ట్ర ప్రజలు ఎక్కడికైనా ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. మరోవైపు వరదల్లో గాయపడిన వారిలో మరో 14 మంది శ్రీనగర్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ లో మృతి చెందారు. అలాగే కాశ్మీర్ లోయలో 29 డెడ్ బాడీస్ దొరికాయని అక్కడి అధికారులు చెప్పారు. ఇప్పటికే వరదలతో 200 మంది చనిపోయారు. పంజాబ్ లోని బటిండా సిటీ నుండి ఓ స్వచ్ఛంద సంస్థ 33,000 ఫుడ్ పాకెట్స్ ని జమ్మూ కాశ్మీర్ లో సప్లై చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: