ప్రభుత్వోద్యాగాలలో స్థానికులకు రిజర్వేషన్లు ఇప్పటికే మన దేశంలో అమలవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్టికల్ 371 (డి ) ద్వారా స్థానిక రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధతను కల్పించారు. మహారాష్ట్రలో స్థానికుల ఉపాదిని దెబ్బతీస్తున్నారని బీహారీలపై ఎం ఎన్ ఎస్ కార్యకర్తలు దాడి చేయడం చూసాం. అమెరికాలో సైతం స్థానికులకు విద్యా సంస్థలలో ప్రత్యేక రాయితీలున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో ప్రైవేట్ రంగంలో కూడా స్థానికులకు ఉద్యోగాలను రిజర్వ్ చేస్తూ పారిశ్రారామిక విధానాన్ని ప్రకటించారు. డి కేటగిరి ఉద్యోగాలు పూర్తిగా స్థానికులకే ఇవ్వాలి. ఎ, బి, సి కేటగిరీలలో ఉద్యోగాలలో మాత్రం 70 శాతం మేరకు ఉద్యోగాలను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: