ఇప్పడు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చాలా ఖుషీగా ఉన్నట్టున్నాడు... కోట్లు కోట్ల రూపాయలు అలా అలా విసిరేస్తున్నాడు. సానియా వెళ్లి కలిస్తే ఒక కోటి రూపాయలు అలా విసిరేస్తున్నాడు. మరి ఇప్పటి వరకూ రెండు సార్లు కలిసిన సానియా రెండు కోట్ల రూపాయలను గిట్టుబాటు చేసుకొంది. మరి ఇదే సానియా మోడీని వెళ్లి కలిసి బొకే ఇస్తే.. ఆయన విషెష్ చెప్పి పంపించాడు. రాష్ట్రపతి కూడా సానియాను అభినందించి పంపించాడు. మరి కేసీఆర్ సారు మాత్రం రెండు సార్లు వెళ్లి కలిస్తే రెండు సార్లూ కోటి కోటి రూపాయలు ఇచ్చి పంపించాడు. విమర్శలు వస్తాయని తెలిసినా.. మరి ఆ టెన్నిస్ క్రీడారినికి కేసీఆర్ అంతంత డబ్బు ఇస్తున్నాడు. మరి అదంతా మైనారిటీ ఓట్లను సంపాదించుకోవడానికి పెడుతున్న పెట్టుబడి కేసీఆర్ భావిస్తున్నాడో ఏమో! మరి సానియా సంగతి అలా ఉంటే... ఇప్పుడు కేసీఆర్ కాన్వాయ్ లోని వాహనాల రంగు మారడం కూడా తెలిసిందే. నలుపురంగు అచ్చిరావడం లేదని కేసీఆరే భావించాడో లేక ఎవరైనా పండితుల వారు చెప్పారో కానీ.. కాన్వాయ్ లోని ఫార్చూనర్ల రంగును మార్పించారు. అసలు కేసీఆర్ వాహనాల రంగు మార్చాలని నిర్ణయించగానే... ఈ వాహనాలే మార్చేయాలని అధికారులు అనుకొన్నారట. అంటే ఈ ఫార్చూనర్ల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలని అనుకొన్నారట. నల్లవాటిని ప్రస్తుతానికి షెడ్లకు తోలి తెల్లవాటిని కొనుగోలు చేయాల్సిందని అనుకొన్నారట. అయితే ఎందుకో వెనక్కుతగ్గారు. కోట్ల రూపాయలు పోసి కొంటున్న వాహనాలు కాబట్టి విమర్శలు వస్తాయని భయపడినట్టుగా ఉన్నారు. అందుకే నల్లవాటికే రంగు మార్చి తెల్లగా చేసి కేసీఆర్ కాన్వాయ్ లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి మూడింటికి రంగు మార్చామని మిగిలిన రెండింటికీ మార్చి వాటిని కూడా కాన్వాయ్ లోకి అప్పగించానున్నామని అధికారులుచెబుతున్నారు. మరి మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రానికి పెద్ద కాబట్టి కేసీఆర్ కు నిధుల కొరత అయితే లేదు. మరి ఆ మిగులును ఎన్ని రోజుల పాటు నిలబెట్టుకొంటాడో ఈ ముఖ్యమంత్రి!

మరింత సమాచారం తెలుసుకోండి: