మళ్లీ రొటీనే... సీబీఐ చార్జిషీట్ పై వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక సమాధానం చెప్పింది. ఏది నిజం కాలమ్ ను కంటిన్యూ చేసింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు క్యారికేచర్ తో సీబీఐ పై ధ్వజమెత్తింది. అయితే ఈ సారి కాస్తంత లేటుగా సమాధానం ఇచ్చింది. సీబీఐ చార్జిషీటుపై ఈనాడు పత్రిక వార్త రాసిన రెండో రోజున సాక్షి సమాధానం ఇచ్చింది. ఆది వారం ఎడిటోరియల్ పేజ్ ను ఏదినిజంకు త్యాగమిచ్చింది. జగన్ కేసుపై ధర్యాప్తు జరుపుతున్న సీబీఐ వాళ్లు ఇటీవల ఇందూ సంస్థ గురించి చార్జిషీట్ దాఖలు చేసిన విషయం విదితమే. చార్జిషీట్ లోని వివరాలు అంటూ జగన్ వ్యతిరేక మీడియాలో పెద్దగా కథనాలు వచ్చాయి. ఎన్నికల తర్వాత సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జిషీటు ఇది. ఈ నేపథ్యంలో మీడియా ఇంతకు ముందులాగా వ్యవహారించడం విశేషం. జగన్ వార్తలను తొలిపేజీకి ఎక్కించే ఈనాడు చార్జిషీటు లోని వివరాలు మాకు తెలిశాయంటూ కథనాన్ని వండింది. ఇందూలోంచి అందులోకి అంటూ కథనాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో పెట్టుబడి పెట్టడం తప్పా? అంటూ సాక్షి వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇందూలోనించి నేరు పెట్టుబడులు రాకున్నా లింకులు వెదికిన దర్యాప్తు సంస్థ అంటూ ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి వచ్చిన ఐదు కోట్ల రూపాయలను చూపుతూ క్విడ్ ప్రో కో వాదన అంటూ ఎడిటోరియల్ పేజీలో ఏది నిజం రాశారు. ఇందూ ఏపీ హెచ్ బీప్రాజెక్టుల్లో ఉల్లంఘనలు ఉన్నాయని, ఆ ఉల్లంఘనలను ప్రభుత్వం పట్టించుకోనందునే జగన్ సంస్థలోకి పెట్టుబడులు వచ్చాయని సీబీఐ పేర్కొందని, ఇది హాస్యాస్పదంగా ఉందని సాక్షి పేర్కొంది. సీబీఐ చార్జిషీటుకు తోడు తన సొంత కథలను జోడించి ఈనాడు రాతలు రాసిందని సాక్షి రామోజీ రావుపై ధ్వజమెత్తింది. ఇందూ ప్రాజెక్టు వ్యవహారం అంతా పబ్లిక్ గా జరిగిందేనని, వేలం పాటలో ఎక్కువ ధరను ఆఫర్ చేసి ఇందూ ప్రాజెక్టులను సొంతం చేసుకొందని అలాంటప్పుడు క్విడ్ ప్రో కో వాదనకు విలువేముందని సాక్షి వాదించింది. ఇదంతా జగన్ సంస్థలో ఇన్వస్టర్లను వేధించడమే ధ్యేయంగా జరుగుతున్న తతంగం అని అభిప్రాయపడింది. సీబీఐ చార్జిషీటు ఒట్టి డొల్ల అని ఈ కథనంలో పేర్కొన్నారు. మరి ఇదంతా రొటీనే... సీబీఐ వాళ్లు చార్జిషీటు వేయడం దానిపై ఈనాడు ఏదో ఒకటి రాయడం, దానికి సాక్షి ఖండన రాయడం. ఇదంతా రొటీన్ తతంగమే... ఎన్నికలయ్యాకా కూడా అదే కొనసాగుతోంది! మర ఇలా ఎన్ని రోజులో..!

మరింత సమాచారం తెలుసుకోండి: