భారత కీలక రహస్యాలను సేకరించేందుకు తమ దేశీయులను నియోగించడంలో ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది. ఇందులో భాగంగా శ్రీలంక వాసులను నియమించుకుంటూ తన పనిని సులువుగా కానిచ్చేస్తోంది. ఐఎస్ఐ తో పాటు పాక్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా కూడా ఇదే బాటలో నడుస్తోంది. పాక్ గూఢచర్య సంస్థ, లష్కరే తోయిబాలు అనుసరిస్తున్న ఈ తరహా పన్నాగాలు, ఇటీవల లంకేయుల అరెస్టుల సందర్భంగా వెలుగు చూశాయి. లంకలోని ముస్లింలను తమ బుట్టలో వేసుకుంటున్న పాక్ సంస్థలు, భారత్ కు సంబంధించిన అత్యంత కీలక రహస్యాలను రాబట్టడంతో పాటు దాడులు చేయాలనుకుంటున్న ప్రాంతాలపై రెక్కీ నిర్వహించేందుకూ వారినే వినియోగిస్తున్నాయి. గడచిన పది నెలల్లోనే ఈ తరహా కార్యక్రమాలకు పాల్పడిన ముగ్గురు లంకేయులు పట్టుబడ్డారు. తాజా ఘటనలతో పాక్ పన్నాగాలపై మరింత కీలక దృష్టి కేంద్రీకరించాలని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: