మెదక్ బై పోల్స్ కంప్లీట్ అవడంతో GHMC ఎలక్షన్స్ పై కాన్సంట్రేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవ్వాళ గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల నేతల విస్తృత స్థాయి జరగనుంది. ఈ సమావేశానికి టీపీసీసీ ముఖ్య నేతలతో పాటు, జాతీయ నాయకులు కూడా హాజరు కానున్నారు. GHMC ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ ప్రచారం వంటి విషయాలపై AICC లీడర్లు, లోకల్ కాంగ్రెస్ నాయకులతో డిస్కస్ చేయనున్నారు. కాంగ్రెస్ స్టేట్ ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్, సీనియర్ లీడర్ కుంతియా, పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, AICC ఎస్సీ సెల్ నేషనల్ ప్రెసిడెంట్ కొప్పుల రాజుతో పాటు ఇతర ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, గ్రేటర్ లో పార్టీకున్న క్యాడర్, సెటిలర్స్ సపోర్ట్, హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేత వంటివి తమకు ప్లస్ అవుతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, మజ్లిస్ మెజారిటీ కార్పోరేట్ స్థానాలను గెలుచుకొని మేయర్ పీఠాన్ని చెరో రెండున్నరేళ్ళు షేర్ చేసుకున్నాయి. అయితే మజ్లిస్ గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ తో క్లోజ్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తుండడం తో, MIM ఈ సారి కలిసి వస్తుందా లేదా అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: