రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీలను అమలు చేయాలని డిమాండ్ చేశాడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విభాగం శాసన పక్ష నేత విష్ణుకుమార్ రాజు. రైతులు, మహిళలకు హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం రుణమాఫీని చేయాలని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా సైలంట్ ఉండటం సరికాదని ఆయన అన్నాడు. మరి భారతీయ జనతాపార్టీ వైపు నుంచి ఇలాంటి డిమాండ్ వినిపించడం విశేషమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు గనుక రుణమాఫీ అంశం గురించి మాట్లాడితే తెలుగుదేశం వాళ్లు విరుచుకుపడతారు. ఇక కొంతమంది విశ్లేషకులు కూడా జగన్ మోహన్ రెడ్డికి రుణమాఫీ విషయంలో ఏం తొందరొచ్చింది? అంటుంటారు! ఇలాంటి నేపథ్యంలో రుణమాఫీ అంశం గురించి భారతీయ జనతా పార్టీ వాళ్లు మాట్లాడట, తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించడం విశేషంగా మారుతోంది. భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కేంద్రంలోని ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో అధికారాన్ని పంచుకొంది. మంత్రి పదవిని కూడా తీసుకొంది. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని బీజేపీ వాళ్లు పెద్దగా విమర్శించడానికి అవకాశం లేదు. అయినప్పటికీ రుణమాఫీ చాలా విస్తృతమైన అంశం, ఎక్కువమందిని ప్రభావితం చేసే అంశం అయినందున బీజేపీ వాళ్లు ఈ వ్యవహారంలో మాట్లాడుతున్నారు. రైతులు, మహిళల తో ముడిపడి ఉన్న వ్యవఠహారం కాబట్టి ఈ హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి మిత్రపక్షం నుంచినే ఇలాంటి డిమాండ్ వినిపిస్తుండటంపై తెలుగుదేశం వాళ్లు ఎలా స్పందిస్తారో!

మరింత సమాచారం తెలుసుకోండి: