ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీ హామీని అమలు చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునా యడు అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ హామీ అమలే ప్రధాన అజెండాగా మారింది. మిగిలిన అన్నీ అంశాలన్నింటిలోకీ రుణమాఫీ అంశంపైనే మంత్రివర్గం ఎక్కువ సమయం కేటాయించినట్లు తెలి సింది. రుణమాఫీకి బ్యాంకులు, రిజర్‌‌వ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా మొకాల డ్డటంతో ఏమి చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. రుణమాఫీపై విష యమై సహాయం అందించటంలో భాగంగా బ్యాంకులను, ఆర్‌బిఐని ఒప్పిం చేందుకు చంద్రబాబు చేసిన అన్నీ ప్రయత్నాలూ విఫలమయ్యాయి. దాంతో ఏమి చేయాలో చంద్రబాబుకు పాలుపోవటం లేదు. అదే విషయాన్ని మంత్రివ ర్గం సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. హామీ నిలబెట్టుకునేందుకు అందు బాటులో ఉన్న అన్నీ మార్గాలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. ఎఫ్‌ఆర్‌బిఎం (అప్పు తెచ్చుకునే పరిధిని పెంచుకోవటం) పరిధిని విస్తరించుకోవటం, ఎర్ర చందనం అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని ఉపయోగించుకోవటం, ఐపిఐఐసి భూములను తనఖా పెట్టటం, ఇసుక, ఎకై్సజ్‌ విభగాల ద్వారా ప్రభుత్వానికి వ… స్తుందనుకుంటున్న ఆదాయాన్ని బ్యాంకుల్లో హామీగా ఉంచి రుణాలు తీసుకో వటం మొదలైన అన్నీ మార్గాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ నెల 19 -21 మధ్య మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వ పథకాలను, కార్యక్ర మాలకు విస్తృత ప్రచారం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే, ప్ర ధానమైనది, సమస్యాత్మకమైన రుణమాఫీ హామీని అములు చేయకుండా ఇపు డు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలన్న అంశం కూడా మంత్రివర్గంలో చర్చకు వచ్చింది. హామీని నిలబెట్టుకోకుండానే ప్రజల్లోకి వెళితే తలెత్తబోయే ఇబ్బందులను మం త్రులు చంద్రబాబుతో ప్రస్తావించినట్లు సమాచారం. సుదీర్ఘ చర్చ తర్వాత ము ఖ్యమంత్రి మాట్లాడుతూ, అక్టోబర్‌ 2వ తేదీ నుండే రుణమాఫీ ప్రక్రియ అమలు కు శ్రీకారం చుడుదామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే, 100 రోజుల పా లనపైనా చంద్రబాబు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిసింది. అయితే, చంద్ర బాబు పనితీరుకు, మంత్రుల పనితీరుకూ మధ్య చాలా అంతరం ఉన్నట్లు ము ఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు సమాచారం.పలువురు మంత్రుల పనితీరు పట్ల చంద్రబాబు పెద్దగా సానుకూలంగా లేరోమోనన్న అనుమానం కూడా మంత్రు ల్లో తలెత్తింది. అయితే, మంత్రుల పనితీరును కేవలం శాఖా పరంగా మాత్రమే భేరీజు వేయటం తగదని కూడా ఒక మంత్రి అన్నారు. ఒక మంత్రికి అధికారు లతో పని చేయించుకోవటం బాగా వచ్చు. మరో మంత్రికి పార్టీ క్యాడర్‌ను కా పాడుకోవటం వచ్చు. ఇంకో మంత్రి ప్రసంగాలు ఇవ్వటంలో దిట్ట కావచ్చు, మ రొక మంత్రి జిల్లాలో పార్టీని పటిష్టం చేయటంలో ఎంతో శ్రమించవచ్చు అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. కాబట్టి మంత్రి పనితీరును శాఖపరమైన అంశం లో మాత్రం చూడటం తగదన్నారు. డిజిటల్‌ స్టేట్‌పై కూడా చర్చ జరిగినట్లు స మాచారం. ఈ పథకంలో ప్రభుత్వంతో వర్కింగ్‌ పార్టనర్‌లుగా ఉన్న బిఎస్‌ఎన్‌ ఎల్‌, ఎయిర్‌టెల్‌ సంస్దలు ప్రభుత్వ వేగాన్ని అందుకోలేక పోవటంపై చంద్రబా బు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశానికి సదరు రెండు సంస్దల ప్రతినిధులను పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. ఎయిర్‌టె ల్‌ లాంటి ప్రైవేటు సంస్ద కూడా ప్రభుత్వ సంస్ధలాగ పనిచేస్తుండటం పట్ల చం ద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.  రెండు సంస్ధలూ తమ విధానాన్ని మార్చుకుని ప్రభుత్వంతో పాటు పోటీగా పనిచేయకపోతే కేంద్ర ప్ర భుత్వానికి ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించినట్లు సమాచారం. అదేవిధంగా మంత్రులందరూ సోషల్‌ నెట్‌వర్‌‌క సైట్లను ఎక్కువగా ఉపయోగించుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఉద్యోగుల బదిలీలపై కూడా చర్చ జరిగినట్లు సమా చారం. విద్యాశాఖ(హెచ్‌ఆర్‌డి) మంత్రి గంటా శ్రీనివాస్‌రావు బదిలీల వ్యవహా రాన్ని ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఒకే శాసనసభ్యుడు ఒకే పోస్టుకు మూడు సిఫారసులు చేస్తున్న విషయాన్ని చంద్రబాబు దృష్టికి తెచ్చిన ట్లు తెలిసింది. ఒకే పోస్టుకు శాసనసభ్యులు తెస్తున్న ఒత్తిడిని మంత్రి ప్రస్తావిం చగా, ఒత్తిళ్లకు లొంగకుండా విచక్షణ ఉపయోగించాల్సిందిగా చంద్రబాబు సూ చించినట్లు సమాచారం. ఇష్టమొచ్చినట్లు బదిలీలు చేయటం, డబ్బులు తీసు కుని బదిలీలు చేయటం వద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. బదిలీలకు డబ్బులు తీసుకుంటున్నట్లు ఇప్పటికే బయట ప్రచారం జరుగుతున్నట్లు కూడా చంద్రబా బు అన్నట్లు తెలిసింది. ఇటువంటి పనులు చేసి గతంలో కాంగ్రెస్‌ నేతలు భ్రష్టు పట్టినట్లు కావద్దని గట్టిగా హెచ్చరించినట్లు కూడా సమాచారం. ఇక, రాజధాని కోసం భూ సేకరణపై మాట్లాడుతూ, చంద్రబాబు రెండు విధానాలను అవలంభి స్తారని అభిప్రాయపడ్డారు. ల్యాండ్‌ కామన్‌ పూలింగ్‌ నవీ ముంబాయి విధానం కాగా ల్యాండ్‌ రీ అడ్జస్‌‌టమెంట్‌ విధానం దక్షిణ కొరియాలో అమలులో ఉందన్నా రు. ఎక్కడ ఏ పద్దతి అవలంభించాలో ముఖ్యమంత్రి అవసరాన్ని బట్టి రెండు విధానాలను అవలంభించే అవకాశంఉందని సదరుమంత్రి అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: