మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ, శివసేనల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. పొత్తుతో ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్న ఈ పార్టీల మధ్య చర్చలు ఒక కొలిక్కి రావడం లేదు. సీట్ల సంఖ్య విషయంలో ఈ పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు కనిపిస్తున్నాయి. కోరుకొన్నన్నీ సీట్ల విషయంలో ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కనపడటం లేదు. ఇటువంటి నేపథ్యంలో శివసేన వాళ్లు తాము ఒంటరి పోరుకు కూడా సిద్ధమని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. భారతీయ జనతా పార్టీ తో సీట్ల గురించిన చర్చలు ఒక కొలిక్కి రాలేదని అవసరమైతే తాము ఒంటరి పోరుకు కూడా సిద్ధమని శివసేనా ప్రకటించింది. తమకు ఆ ప్రత్యామ్నాయం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరి ఈ పొత్తు పొడుస్తుందా? పొడవకుండానే అస్తమిస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. మొన్నటి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా భారతీయజనతా పార్టీ, శివసేనలు కలిసి ఎన్నికల్లో బరిలోకి దిగాయి. ఈ కూటమి మహారాష్ట్రలో గ్రాండ్ విక్టరీని సాధించింది. కాంగ్రెస్ , నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీల కూటమిని చిత్తు చేస్తూ ఈ కషాయదళం విజయాన్ని సాధించింది. ఇటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. మరి ఈ సారి కూడా బీజేపీ, శివసేనల కలిసి పోటీ చేస్తే విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రీ పోల్ సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ కూటమిలోని పార్టీల మధ్య విబేధాలు కనిపిస్తుండటం విశేషం. అయితే ఇవన్నీ సమిసిపోతాయని... బీజేపీ, శివసేనలు తిరిగి ఒప్పందాన్ని కుదుర్చుకొంటాయని... సీట్ల గొడవ సుఖాంతం అయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: