మరి తన పాలనతో ప్రజలు దేవుడిని కాదు.. నన్నే నమ్ముకొమ్మని విశ్వాసం కల్పించేవాడే నిజమైన పాలకుడు అవుతాడు... చరిత్రలో ఇలాంటి విశ్వాసాన్ని కల్పించిన పాలకుల పేర్లు కొన్ని వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి సత్తెకాలపు రోజులు కాదు కదా.. అందుకే మన పాలకులు కూడా మేము చేయగలిగింది ఏమీలేదు, అంతా దైవాధీనం అని అంటున్నారు. దేవుడి దయ తప్పనిసరి అంటూ స్పష్టం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పాడు. రాష్ట్రంలో సుఖశాంతులు నెలకొనాలంటే దైవ కృఫ తప్పనిసరి అని అయన అంటున్నాడు. అందుకోసం దేవుడిని మొక్కుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. హజ్ కు వెళుతున్న వారికి కేసీఆర్ ఈ విజ్ఞప్తి చేశాడు. తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ..ప్రజల సుఖశాంతుల కోసం అల్లాకు ప్రార్థన చేయాలని కేసీఆర్ హజ్ యాత్రికులకు విజ్ఞప్తి చేశాడు. హజ్ యాత్రికుల బస్సులను కేసీఆర్ జెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హజ్ యాత్ర పవిత్రత గురించి ప్రసంగించిన ఆయన ముస్లింలకు అనేక వరాలను కూడా ఇచ్చాడు. గత ప్రభుత్వాలు ముస్లింలను నిర్లక్ష్యం చేశాయని... తాము మాత్రం అలా కాదని, ముస్లింల సర్వతో ముఖాభివృద్ధికి సహకరిస్తామని.. కోట్ల రూపాయలు కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చాడు. ఇదంతా ఎలా ఉన్నా.. రాష్ట్రాభివృద్ధి కోసం అల్లాను ప్రార్థించమని కేసీఆర్ హజ్ యాత్రికులకు విజ్ఞప్తి చేయడమే ఇక్కడ హైలెట్ !

మరింత సమాచారం తెలుసుకోండి: