ఒకనాడు ఇందిరాగాంధీని కాంగ్రెస్ నేతలు పొగడటం వెగటుపుట్టించేది. ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర. అంటూ ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు ఆరోజుల్లోనే కాదు, ఇప్పటికి కూడా అసహ్యం వేస్తుంటుంది. ఇప్పుడీ వ్యాధి బిజేపి నేతలకు పాకింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోడీని భారతదేశానికి వచ్చిన దైవదూతగా వర్ణించారు. మోడీకన్నపార్టీలో వెంకయ్య నాయుడు చాలా సీనియర్ వాజ్ పేయి అధ్వానీలను కూడా ఏనాడూ పార్టీనేతలు దైవదూతలుగా కొనియాడలేదు. మోడీతో పెట్టుకుంటే సుష్మస్వరాజ్ లాగా పదవి వున్నా తెరవెనక్కు పోతామన్న భయం బిజేపి నేతల్లో కనిపిస్తోంది. లేదంటే అద్వానీ జోషీలలాగా తమను కూడా పక్కకి పెట్టాస్తారేమో నన్న బెంగ పట్టుకుంది. దీంతో రాజకీయల్లో ఈ దిగజారుడుతనం కాంగ్రెస్ నుంచి బిజేపికి పాకింది. సీనియర్ నేతలకు కూడా ఈ వ్యాధి సోకింది. వాజ్ పేపి అధ్వానీలను వికాస్ పురుష్, లోహ పురుష్ అంటూ వ్యక్తిగత కీర్తనలతో ముంచెత్తిన నాడు బిజేపి నేతలను ఆరెస్సెస్ సుతిమెత్తగా హెచ్చరించింది. వ్యక్తుల కన్నా సిధ్దాంతాలు ప్రచారం చేసుకోండి.అంటూ ఆనాడు ఆరెస్సెస్ బహిరంగంగానే సలహా ఇచ్చింది. ఇప్పుడు మరి ఎందుకు మౌనంగా వున్నారో తెలియదు. ఉపఎన్నికలలో వరుసగా బిజేపి ప్రతిష్ట దెబ్బ తింటోంది. బహుశా ఇదెక్కడా మోడీ గ్లామర్ ను తగ్గిస్తుందేమో నన్న భయంకాబోలు. కలవరపడి కమల నాధులు కీర్తనలందుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: