తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవి కోసం రోజురోజుకు ఆశావాహులు ఎక్కువవుతున్నారు. ఇప్పటికే వై.వి.వి. రాజేంద్రప్రసాద్‌, పయ్యావుల కేశవ్‌, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గల్లా అరుణ కుమారి, సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌ తదితరలు ఎమ్మెల్సీ పదవుల రేసులో పడిగాపులు పడుతున్నారు. వీరుగాక ఇంకా ఆశావాహుల లిస్టు చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది. వీరంతా పార్టీ అధినాయకులు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాపగండం కోసం ఎవరికి చేతనైన ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళ నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారంతా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. గతంలో మంత్రుగా చేసి, అనంతరం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే 10 సంవత్సరాలు పార్టీ అభివృద్దికి కృషి చేసిన వారంతా మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే తమకు తప్పకుండా మంత్రి పదవులు వరిస్తాయనుకున్న వారంతా దరదృష్టం వల్ల ఓడిపోయారు.  ఈ సందర్భంగా తమ పార్టీ అధికాంలోకి వచ్చినందుకు సంతోష పడాలో, తాము ఓడిపోయినందుకు బాధ పడాలో తెలియక అయోమయంలో ఉన్నారు. మొదటినుంచి పార్టీలో ఉండి ఓడిపోయిన వారి బాధ ఒకటైతే, ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీలో చేరి, ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓడిపోయిన వారి బాధ మరో రకంగా ఉంది. నిన్ని మొన్న పార్టీలో చేరి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుకూడా అయిపోతుంటే,కాంగ్రెస్‌ పార్టీపై 10 సంవత్సరాలు పోరాటంచేసి, కష్టనష్టాలకు ఓర్చి, ఒట్టిగా ఉన్నామనే బాధ ఓడిపోయిన సీనియర్‌ నాయకుల్లో కనబడుతుంది.  అయితే పార్టీకి తాము చేసిన సేవలకు చంద్రబాబు తప్పకుంగా గుర్తింపు నిస్తారని, తమకు న్యాయం చేస్తారని తమ అధినాయకులు చంద్రబాబుపై వీరంతా ఆశలు పెట్టుకున్నారు. వీరందరికి న్యాయం చేయాలని ఉన్నా తగిన సమయం సందర్భం రాలేదని చంద్రబాబు ఇప్పటివరకు వేచి ఉన్నారని, ఇప్పుడు నామినేటెడ్‌ పదువులైనా తప్పకుండా ఇస్తారని వారు భావిస్తున్నారు. చంద్రబాబుకు కూడా మొదటి నుంచి పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారిని వదులుకోకూడదని, ముఖ్యంగా ప్రతిపక్షాలను తమ మాటలతో, వ్యాఖ్యలతో కడ్డడి చేయగలిగే వారు ఈ ఎన్నికల్లో ఓడిపోవటం దురదృష్టమని బాబు భావిస్తున్నారని సమాచారం. అందుకే వీరికి నామినేటెడ్‌ పదవులలో స్థానం కల్పించాలని చంద్రబాబు కృత నిర్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: