ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి. కోడెల కుమారుడు శివరామకృష్ణ, కోడలు పద్మప్రియల మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో గత కొంత కాలంగా వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి గౌతమ్ (4) అనే కుమారుడు ఉన్నాడు. విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడెల కోడలు పద్మప్రియ తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. 2009లో వీరిద్దరికీ వివాహం జరిగింది. ఆ తరువాత మనస్పర్ధలతో దూరంగా ఉంటున్నారు. అయితే భార్య ఉంటున్న ఇంటిమీద బుధవారం అర్ధరాత్రి నలుగురు వ్యక్తులతో కలిసి కోడెల కుమారుడు శివరామకృష్ణ దాడికి పాల్పడ్డాడు. ఇంటి తలుపులు పగులగొట్టి ఆమె వద్ద ఉన్న కుమారుడిని లాక్కెళ్లాడు. కోడెల భార్య, కుమార్తెలు తనను తరచూ వేధించేవారని, 2010లో బాబు పుట్టిన తరువాత పలుమార్లు తనను ఇంటి నుండి గెంటేశారని, ఇటీవల కోడెల అధికారంలోకి వచ్చిన తరువాత వేధింపులు అధికం అయ్యాయని పద్మప్రియ వెల్లడించారు. తన కుమారుడిని కిడ్నాప్ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారన ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: