వినూత్నంగా ఏపీ ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు నిరుపేదలకు బహుమతులు అందచేయబోతున్నారు. ప్రధానమైన దసరా, దీపావళి పం డుగల సందర్భంగా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ విడివి డిగా బహుమతులను అందచేయాలని నిర్ణయించటం గ మనార్హం. దసరా పండుగకు ధోవతులు, చీరెలు ఇవ్వాలని నిర్ణయించగా, దీపావళి పర్వదినాన నిత్యావసరాలు, టపా కాయలులాంటివి ఇవ్వాలని ప్రభుత్వంనిర్ణయించింది. ఎం తమందికి ఇవ్వాలి, ఎంత వ్యయం చేయాలనే విషయమై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు కానీ అర్హులైన పేదలంద రికీ పంచాలని మాత్రం నిర్ణయం జరిగింది. పేదలెంతమం ది అన్న విషయంలో ఎటూ ప్రభుత్వంవద్ద ఒక లెక్క ఉం టుంది, అయితే, బహుమతుల్లో ఏవి ఇవ్వాలనే విషయం లో ఒక నిర్ణయానికి వస్తే అప్పుడు ఎంత ఖర్చు అవుతుంద న్న విషయంపై స్పష్టత వస్తుంది. 100 రోజుల పాలనలో సాధించిన ప్రగతిని వివరించేందుకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు గురువారం స చివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బిపిఎల్‌ కుటుంబాల కు ప్రభుత్వం బహుమతులు పంచనున్నట్లు వెల్లడించారు. రెండు పర్యదినాలకు విడివిడిగాబహుమతుల పంపిణి ఉం టుందని పేర్కొన్నారు. అదేవిధంగా, ఎస్సీ, ఎస్టీల్లోని ఔత్సా హిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకంగా వెంచర్‌ క్యాపి టల్‌ను ప్రారంభించిననున్నట్లు తెలిపారు. ఈ విధానంలో ప్రభుత్వం రూ. 100 కోట్లను హామీగా పెడుతుందన్నారు. దీని వల్ల సుమారు 1.25 లక్షల మంది ఔత్సాహికులకు ఆ ర్దిక సహాయం చేయవచ్చన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు బ్యాంకుల్లో తీసుకునే రుణాలకు ప్రభుత్వం ఏర్పా టు చేస్తున్న 100 కోట్ల రూపాయల నిధి హామీగా ఉంటుం దన్నారు. ఈహామీ రూ. 10వేల కోట్ల రూపాయల రుణాల మంజూరు వరకూ ఉపయోగపడుతుందని మంత్రి చెప్పా రు. రాష్ట్రంలోని అన్నీగ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రభుత్వం ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు కూ డా మంత్రి వివరించారు. ఇందుకోసం సులభ్‌ కాంప్లెక్స్‌ ద్వారా ప్రముఖుడైన బిందేశ్వర్‌ పాఠక్‌ను సంప్రదించాలని తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించానన్నారు. గుంటూరు జిల్లాలో తన నియోజకవర్గమైన పత్తిపాడులో నూరుశాతం మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టు కున్నట్లు మంత్రి పేర్కొన్నారు.తన నియోజకవర్గంలోని 45 వేలగృహాలకు మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. కాగా,ఇప్పటికే 15వేల ఇళ్ళకు అనుమతులు మంజూరు చేశామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో తన కృషి నిము ఖ్యమంత్రి కూడా అభినందించినట్లు మంత్రి పేర్కొన్నారు.  రాష్ట్రాన్ని అన్నీరంగాల్లోనూ అభివృద్ధి చేయాలని చంద్రబా బు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చైనా, సింగపూర్‌, మలేషియా, ఆస్ట్రేలియా, జెర్మనీ తదితర దేశాల నుండి పె ట్టుబడులు పెట్టటానికి పలువురు సిద్దంగా ఉన్నట్లు వెల్లడిం చారు. తనశాఖ సాధించిన ప్రగతిని వివరిస్తూ, ఎస్సీ హాస్ట ళ్ళలో 1.25 లక్షల మంది విద్యార్ధులను చేర్చుకు న్నట్లు తె లిపారు. 244 పాఠశాలల్లో 2600 మంది విద్యార్ధులను చేర్చుకున్నట్లు వివరించారు. కార్పొరేట్‌ కళాశాల పథకం లో భాగంగా ప్రైవేటు కళాశాలల్లో 3238 మంది విద్యార్ధు లను చేర్చినట్లు తెలిపారు. పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్పుల బకాయిల్లో రూ. 89 కోట్లు విడుదల చేశామన్నారు. గిరిజ న సంక్షేమ విద్యాలయాల్లో లక్షమంది విద్యార్ధులను నమో దు చేసినట్లు పేర్కొన్నారు. 461విద్యాసంస్ధల్లో విద్యార్ధుల కు ఆరోగ్యపరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 2014- 15సంవత్సరంలో 38 విభాగాలకుగాను రూ.1500కోట్ల ను గిరిజన సబ్‌ప్లాన్‌ రూపంలో కేటాయించినట్లు వెల్లడిం చారు. ఏడాదిలో చేయాల్సిన అభివృద్ధి పనులను చంద్రబా బు ఒక మాసంలోనే చేపట్టినట్లు కితాబునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: