సంచలనం సృష్టించిన తెలంగాణ సమగ్ర కటుంబ సర్వే లెక్కలు తేలాయ్.. సర్వే పత్రాల్లోని వివారాలన్నీ కంప్యూటర్లకెక్కాయి. ఏ పని చేద్దామన్నా.. అంతా తప్పుల తడకగా సమాచారముందని అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్ కు ఇప్పుడు ఫుల్లుగా పని చేసుకునే అవకాశం లభించింది. ఇంకా తన మార్కు పాలన ప్రారంభమే కాలేదని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. మరి ఇక సర్వే వివరాలు అందుబాటులోకి వచ్చాకైనా... కేసీఆర్ పాలన జోరుందుకుంటుందేమో చూడాలి. సర్వే వివరాల్లోకి వెళ్తే.... తెలంగాణ రాష్ట్ర జనాభా 3కోట్ల 61లక్షలుగా తేలింది. మొత్తం కోటి 58 వేల కుటుంబాలున్నాయి. సర్వే లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ జనాభా 70 లక్షలుగా తేల్చారు. సర్వే సమయంలో ఇది కోటి 20 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా వేసినా... మొత్తానికి 73 లక్షలేనని తేలింది. కుటుంబాల సంఖ్య, జనాభా.. ఏ రకంగా చూసినా తెలంగాణ జిల్లాల్లో హైదరాబాద్ ముందుంది. ఇక జనాభాలో హైదరాబాద్ తర్వాత స్థానాన్ని 42 లక్షలతో మహబూబ్ నగర్ ఆక్రమించింది. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాలపరంగా చూసినా.. జనాభా పరంగా చూసినా చిట్టచివరి స్థానంలో నిజామాబాద్ జిల్లా ఉంది. ఈ జిల్లా జనాభా 24లక్షలు మాత్రమే. చివరి నుంచి రెండో స్థానంలో 26 లక్షలతో ఖమ్మం జిల్లా ఉంది. సమగ్ర సమాచారం కంప్యూటర్లలో నిక్షిప్తం కావడంతో.. ఇక ఎలాంటి సంక్షేమ కార్యక్రమమైనా ఈ డాటా ఆధారంగానే లబ్దిదారులను గుర్తిస్తారు. ఇప్పటివరకూ ఉన్న అనర్హులను తొలగిస్తారు. మరి సర్వే సందర్భంగా హైదరాబాద్ లో సెటిలైన ఆంధ్రాప్రాంతం వారిలో అనేక అనుమానాలు తలెత్తాయి. వారివి ఒట్టి అనుమానాలేనా.. లేక వారి భయంలో ఎంత వరకూ వాస్తవం ఉంది.. అన్న విషయాలు నిలకడ మీద తెలుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: