ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ జన్మభూమి కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. జన్మభూమి-మనవూరు కాగ్యక్రమం పేరుతో సాగే ఈ పధకంలో విదేశాలలోను, దేశంలోని ఇతర ప్రాంతాలలోను ఉండే వారు తమ సొంత గ్రామానికి ,ప్రజలకు తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో దీనిని నిర్వహిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు.గతంలో జన్మభూమి కార్యక్రమం కింద ఏనైనా పని చేపట్టడానికి సగం ఖర్చును గ్రామం లేదా కాలనీవారు భరించవలసి వచ్చేది.ప్రత్యేకించి రోడ్లు,డ్రైనేజీ తదితర పనులకు ఈ కార్యక్రమాన్ని వాడుకునేవారు.ఆ తర్వాత రోజులలో దీనిపై విమర్శలు వచ్చాయి. ఒక వైపు పన్నులు చెల్లిస్తూ, మరో వైపు ఈ ఏభై శాతం వ్యయం భరించాలనడం ఏమిటనే వాదన ఉండేది. కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించేవారు.అయితే ఇది స్పూర్తివంతమైన కార్యక్రమంగా టిడిపి ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహించేది. మరి ఈసారి ఎలా జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: