టైటిల్ చూసి కంగారు పడకండి.. మీరు చదివింది నిజమే.. కాకపోతే డైరెక్టుగా కాదు. ఇండైరెక్టుగా.. మన పొరుగుదేశమే అయినా..చైనా వాళ్ల భాష, పేర్లు చాలా వెరైటీగా ఉంటాయి.. చుంగ్.. చాంగ్.. చింగ్.. తరహాలో ఓ పట్టాన అర్థం కావు. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ను బట్టి ఏదో ఒక అంచనాకు వచ్చి పలకడమే కానీ.. వాళ్ల పేర్లను మనం యాజ్ ఇట్ ఈజ్ గా పలకలేం. ఈ వైవిధ్యతే ఓ యాంకర్ కొంప ముంచింది. ప్రభుత్వ ఉద్యోగం కాస్త ఊడిపోయేలా చేసింది. అసలు విషయం ఏమిటంటే.. చైనా అధ్యక్షుడి రాక సందర్భంగా డీడీలో ఓ వార్త ప్రసారం చేశారు. చైనా అధ్యక్షడి పేరు ఆంగ్లంలో XI JINPING అని ఉంటుంది. పేరులోని రెండో పదాన్ని జిన్ పింగ్ అని పలకడంలో పెద్దగా కష్టమేమీ లేదు కానీ.. వచ్చిన చిక్కండా మొదటి పదంతోనే.. ఉన్నవి రెండు అక్షరాలే అయినా.. మహా కన్ ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. న్యూస్ రీడర్లే కాదు.. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ పేరును ఎలా పలకాలా అని తికమక పడ్డాయి. చివరకు తలా ఒక రకంగా మొదలుపెట్టి.. ఆ చైనా పెద్దాయన దేశం విడిచేటప్పటికి ఓ క్లారిటీకి వచ్చాయి. XI.. అనే చైనా అధ్యక్షడి పేరులోని మొదటిపదాన్ని కొందరు క్సీ.. అని పలుకుతున్నారు.. మరికొందరు గ్జీ అని పలుకుతున్నారు. మరికొందరు ఎందుకంత కష్టం అని చెప్పి.. సింపుల్ గా జీ అని పలుకుతున్నారు. కాకపోతే జీ జిన్ పింగ్ అంటే.. ఇంగ్లీష్ ఇనీషియల్ తరహాలో ఉందని.. కాబట్టి అలా పలకొద్దని మరికొందరు సూచిస్తున్నారు. కాకపోతే ఆ దూరదర్శన్ యాంకర్ కు క్సీ.. గ్జీ.. జీ.. ఈ మూడు రకాలుగా కాకుండా ఇంకో రకంగా స్ఫురించింది. చిన్నప్పుడు లెక్కలు బాగా చదివారో.. లేకపోతే.. ఒకటో జార్జి, రెండో జార్జి అంటూ చరిత్రపై పట్టుసాధించారో తెలియదు కానీ..దాన్ని ఇంగ్లీషు పదంగా గాక.. రోమన్ అక్షరంగా భావించారు. లూయీ చక్రవర్తుల తరహాలో జిన్ పింగులు కూడా చాలామంది ఉన్నారేమో అనుకుని.. లెవన్త్ జిన్ పింగ్ అని చదివేశారు. కంగారులో తప్పు జరిగిపోయిందని భావించినా.. అదేమీ చిన్న అపరాధం కాదు.. అందులోనూ.. దూరదర్శన్ కు చెందిన యాంకర్. చర్యతీసుకోకపోతే.. పక్కదేశాన్ని అవమానించినట్టు అవుతుంది. దీంతో.. అలా తప్పుపలికిన యాంకర్ ఉద్యోగం ఊడిపోయింది. ఆ యాంకర్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు దూరదర్శన్ న్యూస్ డీజీ అర్చనాదత్తా తెలిపారు. అంత చిన్న తప్పుకే ఉద్యోగం పోయిందా.. ఇంకా నయం.. అలా పీకేస్తే తెలుగు టీవీమీడియాలో యాంకర్లే దొరకరు అని సైటైర్లేసుకుంటున్నరు తెలుగుజనం..

మరింత సమాచారం తెలుసుకోండి: