అవశేష ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిగా నిర్ణయించిన విజయవాడకే మెట్రోరైలు సరిపోతుందని ఏపీ మెట్రో ప్రధాన సలహాదారు ఈ శ్రీధరన్‌ అభిప్రాయపడ్డారు. మెట్రో రైలు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు విజయవాడ వచ్చిన ఆయన ఉడా కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. నూతన రాష్ట్ర రాజధాని విజయవాడకు మెట్రో రైలు అవసరం ఉందని, ప్రభుత్వం కూడా ఇక్కడ మెట్రో నిర్మాణం త్వరగా సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఉందన్నారు. మెట్రో నిర్మాణాన్ని ఆదాయ మార్గంగా కాక పట్టణాల అవసరాలను తీర్చే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వాలు చేపడుతున్నాయన్నారు. అయితే పట్టణాల సామర్థ్యాలను బట్టి మెట్రో నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉంద న్నారు. విజయవాడలో చేపట్ట నున్న మెట్రో మీడియం తరహాలో నిర్మిస్తున్నామన్నారు. హై మెట్రోలో ప్రతి గంటకు 90 వేలమంది ప్రయాణీస్తారని, అదే మీడియంలో అయితే 40 వేల నుంచి 50 వేల మంది ప్రయాణీస్తారన్నారు. అదే చిన్నతరహా మెట్రో మార్గాల్లో 30 వేల మంది గంటకు ప్రయాణీస్తారన్నారు. విజయవాడ మెట్రో నిర్మాణంపై పూర్తిస్థాయి నివేదికను ఫిబ్రవరి నెలలోపు ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. మంత్రి వర్గ సమావేశంలో దీనిపై తీసుకునే నిర్ణయం తరువాత తదుపరి ప్రణాళిక ఉంటుందన్నారు. నాలుగు సంవత్సరాలలోపు ఈ నిర్మాణం పూర్తిచేస్తామని ప్రకటించారు. ఈ మెట్రో నిర్మాణానికి దాదా పు రూ.7 నుంచి 8 వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కిలోమీటరు నిర్మాణానికి సుమారు రూ.200 కోట్ల వరకూ వ్యయం అవుతుందన్నారు. విజయవాడలో రెండు దశల్లో నిర్మించే మెట్రో రైలు కోసం కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి పటమట, బెంజిసర్కిల్‌, బందరురోడ్డు మీదుగా పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌, అక్కడ నుంచి రైల్వే స్టేషన్‌ ఏలూరు రోడ్డు మార్గాల నుంచి రామవరప్పాడు రింగు వరకూ నిర్మాణం చేస్తామని ప్రకటించారు. మెట్రో రైలుకు భూ సేకరణతో అవసరం ఉండదని రోడ్డు మధ్యలో ఫిల్లర్లను నిర్మించి మెట్రో చేపట్ట నున్నట్లు తెలిపారు. దీంతోపాటు కిలోమీటరుకు ఒకచోట రైల్వే స్టేషన్లను నిర్మిస్తామన్నారు. దీనికోసం రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఖాళీ స్థలాలను సేకరిస్తే సరిపోతుందన్నారు. విజయవాడ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఇప్పుడున్న పరిస్థితుల్లో గుంటూరు జిల్లాకు మెట్రో రైలు అవసరంలేదని అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: