వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ సంస్కారం లేదు.. అని తేల్చేసిన అరకు ఎంపీ సంస్కారం ఇదేనా? అంటూ విరుచుకుపడుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు. ఒక పార్టీ తరపున ఓటేసుకొని గెలిచి అధికారం కోసం ఇప్పుడు అడ్డదారి తొక్కి మరో పార్టీ వైపు వెళ్లడమే కొత్తపల్లి గీత సంస్కారమా? అని వారు ప్రశ్నిస్తున్నారు. సంస్కారంగురించి మాట్లాడుతున్న ఆమె ముందుగా ఎంపీ పదవికి రాజీనామా చేయాలని వారు అంటున్నారు. నిస్సిగ్గుగా తెలుగుదేశం వైపు వెళ్లిన ఆమెకు సంస్కారం గురించి మాట్లాడే అర్హత లేదని అరకు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు విరుచుకుపడుతున్నారు. ఎంపీ హోదా కోసం పాకులాడటం, అధికారం కోసం పాకులాడటమే ఆమె సంస్కారమేమో అనే అనుమానాలు వస్తున్నాయని.. అలాంటి మనిషి సంస్కారం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని వైకాపా శ్రేణులు అంటున్నాయి. చాలా రోజులుగా కొత్తపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ కు దూరం దూరంగానే నడుచుకొంటోంది. ఆమె పార్టీ వీడటం ఇది వరకే ఖాయం అయిపోయింది. అయితే అదును కోసం చూస్తున్న ఆమె ఇప్పుడు ఎలాంటి అదును లేకపోయినా వెళ్లి బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఎంపీల సమావేశానికి హాజరైంది. ఈ సందర్భంగా ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ సంస్కారం లేదని వ్యాఖ్యానించింది. బహుశా తనపై వచ్చిన ఫేస్ బుక్ కామెంట్ల విషయంలో గీత ఈ విధంగా స్పందించిందని అనుకోవాల్సి వస్తోంది. కొత్తపల్లి గీత పార్టీని వీడటం ఖాయమైన నేపథ్యంలో వైకాపా అభిమానులు కొందరు ఆమెపై అనుచితమైన పోస్టులు పెట్టారు. ఓటేసిన ప్రజలకు ద్రోహం చేస్తూ గీత పార్టీ మారుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఆ పోస్టుల గురించి గీత స్పందిస్తూ ఈ సంస్కారం మాటలను మాట్లాడి ఉండవచ్చు. మరి ఆమెకు అంత సంస్కారంఉంటే.. ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలవాలని,, అంతే గానీ ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలోకి చేరడం గొప్ప అనిపించుకోదని వైకాపా వాళ్లు అంంటున్నారు. మరి ఈ విషయంపై గీత ఎలా స్పందిస్తుదో!

మరింత సమాచారం తెలుసుకోండి: