ప్రభుత్వం పై విమర్శలు చేసే ముందు ప్రతిపక్షాలు ఆలోచించాలని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. ఎల్ అండ్ టీ కంపెనీపై ఒత్తిడి తెచ్చి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లేఖ తెప్పించుకున్నప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని జానారెడ్డి ఎందుకు అడగలేదని వినోద్ ప్రశ్నించారు. మీడియా ప్రచారం కోసం ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసి ఆబాసుపాలు కావొద్దని కోరారు. ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా నడిపాడో అదే స్ఫూర్తితో ప్రభుత్వాన్ని నడుపుతామని వెల్లడించారు. విద్యుత్, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, మహిళా రక్షణ, యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: