తెలంగాణ ప్రభుత్వం కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. కేంద్రం నుంచి పన్నులలో వాటా,అలాగే గ్రాంట్ల మంజూరు వంటి విషయాలలో తెలంగాణలో పెరిగిన సెటిలర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలని పద్నాలుగో ఆర్దిక సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరడం విశేషం. 1971 లో కోటి ఇరవై ఏడు లక్షల జనాభాలో మూడు లక్షలమంది సీమాంధ్రులు, రెండున్నర లక్షల మంది ఇతర రాష్ట్రాల వారు ఉండేవారని ,ఆని అది క్రమేపీ పెరుగుతూ ప్రస్తుతం ఆ సంఖ్య అరవై ఒక్క లక్షలకు పెరిగిందని, అందులో ముప్పై ఏడు లక్షల మంది సీమాంధ్రులు ఉండగా,ఇరవై నాలుగు లక్షల మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్ధిక సంఘానికి ఇచ్చిన వినతిపత్రంలో తెలిపారు.మూడున్నర కోట్ల జనాభాలో అరవై ఒక్క లక్షలమంది సెటిలర్లని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం సాయం చేసేటప్పుడు ఈ విసయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరడం విశేషం. అయితే ఇలా అన్ని రాష్ట్రాలలో కూడా చేస్తారా అన్నది చర్చనీయాంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: