అమెరికా టూరిస్ట్ లను అట్రాక్ట్ చేయడానికి వీసా ఇచ్చే ప్రపోజల్ పై సెంట్రల్ గవర్నమెంట్ కసరత్తు చేస్తోంది. ఇండియాలో ఇల్లు లేకుండా… కేవలం ఇక్కడి టూరిస్ట్ ప్లేస్ లను చూడడానికి, ఫ్రెండ్స్ ను కలవడానికి, ప్రోగ్రామ్స్ లో పాల్గొనడానికి వచ్చే అమెరికన్లకు వీసా ఆన్ అరైవల్(VOA) ఇస్తారు. ఈ వీసాతో అమెరికన్లు 30 రోజుల పాటు ఇండియాలో ఉండవచ్చు. VOA ను 2011 లో స్టార్ట్ చేయగా… ఇప్పటి వరకు ఫిన్లాండ్, జపాన్, లక్సెంబర్గ్, న్యూజిలాండ్, సింగపూర్, కంబోడియా, వియాత్నాం, ఫిలిప్పీన్స్, లావోస్, మయన్మార్, ఇండోనేసియా, దక్షిణ కొరియా వంటి దేశాల ప్రజలకు దీన్ని ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది అమెరికన్ టూరిస్ట్ లు భారత్ కు వస్తున్నా..ఇప్పటి వరకు అమెరికా, ఇండియాల మధ్య ఇప్పటి వరకు VOA సౌకర్యం లేదు. పీఎం మోడీ త్వరలో అమెరికాకు వెళ్లనున్నాడు. ఈ టూర్ లోనే VOA పై అఫీషియల్ గా అనౌన్స్ చేసే విధంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్నీ రెడీ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: