కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ వివాదాస్పద వ్యాఖ్యాలు చేశాడు. భారతదేశంలో హిందూమతం ఉనికి గురించి ఆయన ప్రశ్నించాడు. హిందూ అనేది ఒక మతమే కాదని తేల్చేశాడు. ఇతర మతాల నుంచి స్థానికులను వేరు చేయడానికి జరిగిన ఒక ప్రయత్నమే "హిందూ'' అని వీరప్ప వ్యాఖ్యానించాడు. వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఎక్కడా హిందూమతం అనే ప్రస్తావన గానీ,హిందూ అనే శబ్ధం కానీ లేదని వీరప్ప తేల్చిచెప్పాడు. మరి ఒక శాస్త్ర పరిశోధకుడూ కాదు.. చరిత్ర కారుడూ కాదు.. .అయినా వీరప్ప ఇలా వ్యాఖ్యానించడం వివాదంగా మారుతోంది. ఆయన హిందూమత శబ్దం మీదనే రాజకీయం చేస్తున్నాడని అనుకోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ మార్కు మైనారిటీ రాజకీయాలను కొనసాగిస్తున్నాడని చెప్పాల్సి వస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి, ఆయనకు ప్రమాదకరమైన మాట అని చెప్పాల్సి వస్తోంది. హిందూ అనే మాటే ఒక అశబ్దం అని వీరప్ప వ్యాఖ్యానించాడు. దేశంపై ఇతర మతాల దండయాత్రలు జరిగినప్పుడు స్థానిక ప్రజలను వారి నుంచి వేరు చేయడానికే హిందూ మతం ఉనికిలోకి వచ్చిందని వీరప్ప అన్నాడు. మరి శతాబ్దాల చరిత్ర గురించి వీరప్ప ఈ విధంగా తేల్చేయడం విడ్డూరమే. ఆయనే ప్రాతిపదికన ఇలాంటి వ్యాఖ్యానాలు చేశాడో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. గౌరవనీయమైన ఎంపీ హోదాలో ఉండి.. కొన్ని కోట్ల మంది విశ్వాసం గురించి ఆయన విధంగా మాట్లాడటం... తేల్చేయడం తగదని చెప్పవచ్చు. ఒకవేళ వీరప్ప శాస్త్రీయంగా మాట్లాడినా.. ఇంత మంది విశ్వాసాలను కించపరిచే హక్కు మాత్రం ఆయనకు లేదనే చెప్పాలి. ఈ కాంగ్రెస్ నేత తనను తాను కంట్రోల్లో ఉంచుకోవడం మంచిదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: