తొలిరోజే 10 లక్షల ఐఫోన్ 6లను విక్రయించిన యాపిల్, మూడు రోజులు ముగిసేలోగా ఏకంగా కోటి ఐఫోన్ 6 లను అమ్మేసింది. గత శుక్రవారం ప్రారంభమైన ఐఫోన్ 6, 6 ప్లస్ ల కోసం అమెరికా సహా పది దేశాల్లోని వినియోగదారులు ఎగబడ్డారు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, హాంగ్ కాంగ్, జపాన్, పోర్టోరికో, సింగపూర్, బ్రిటన్ లలో యాపిల్, తన ఐఫోన్ 6ల విక్రయాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 16 న కాని భారత్ మార్కెట్ లోకి ఐఫోన్ 6 ప్రవేశించే అవకాశాలు లేవు. కేవలం పది దేశాల్లోనే కోటి మందికి పైగా ఐఫోన్ 6లను కొనుగోలు చేస్తే, మరిన్ని దేశాలకు అమ్మకాను విస్తరిస్తే, డిమాండ్ మేరకు ఐఫోన్ 6 లను ఉత్పత్తి చేస్తామా, లేదా అని యాపిల్ సందిగ్ధంలో పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: