తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి గా తీసుకొన్న నిర్ణయంపై ఆ పార్టీ ఎమ్మెల్య కృష్ణయ్య మండి పడుతున్నాడు. బాబు నిర్ణయం రైటు కాదని... ఆయన అభిప్రాయపడుతున్నాడు. అది సమర్థనీయం కాదని కృష్ణయ్య అభిప్రాయపడ్డాడు. కృష్ణయ్య ఈ విధంగా మండి పడుతున్నది ఆదర్శరైతుల వ్యవహారంలో. ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేయడం సరికాదని కృష్ణయ్య అంటున్నాడు. ఈ మేరకు ఆదర్శ రైతులు హైదరాబాద్ లో నిర్వహించిన ధర్నాకు కూడా కృష్ణయ్య హాజరయ్యాడు. ఆదర్శ రైతుల కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూరుస్తున్నదని అంటూ ఆ వ్యవస్థనే రద్దు చేయడం సరికాదని కృష్ణయ్య అభిప్రాయపడ్డాడు. ఆ పథకంలో ఏమైనా లోటు పాట్లు ఉంటే సరిచేయాల్సింది పోయి.. . ఈ విధంగా మొత్తంగా ఎవరికీ ఉపాధి లేకుండా చేయడం సబబు కాదని కృష్ణయ్య అభిప్రాయపడ్డాడు. ఆదర్శ రైతుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించాడు. మరి తెలుగుదేశం అధినేత తీసుకొన్న నిర్ణయంపై ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ విధమైన ప్రకటన చేయడం విశేషం. కేవలంచంద్రబాబు నిర్ణయాన్నే కాక ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా కృష్ణయ్య తప్పు పట్టాడు. అయినప్పటికీ ఆదర్శ రైతుల వ్యవస్థ గురించి చాలా యాగ్రసివ్ స్పందించింది తెలుగుదేశం నేతలే. ఆ వ్యవస్థను రద్దు చేయాలని మొదట నిర్ణయం తీసుకొన్నది కూడా ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వమే. ఇటువంటి నేపథ్యంలో.... కృష్ణయ్య మాటలు ఆసక్తికరమైనవని చెప్పవచ్చు. అలాగే... ఎమ్మెల్యే అయినప్పటికీ కృష్ణయ్య తన ఉద్యమ పంథాను మార్చుకోలేదని స్పష్టం అవుతోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: