అన్ని వైపుల నుంచి విమర్శలు ఒత్తిళ్లు రావడంతో అనుష్కా శర్మ ను విరాట్ కొహ్లీ ఇండియాకు పంపించేశాడు. ఇంగ్లాపర్యటన సందర్భంగా ఈ కుర్రక్రికెటర్ తీరు విమర్శల పాలయ్యింది. దేశం తరపున ఆడటానికి వెళుతూ హీరోయిన్ ను వెంట తీసుకెళ్లడం ఏమిటి? ఆమెతో కలిసి ఒకే హోటల్ లో, ఒకే రూమ్ లో ఉండటం ఏమిటి? అంటూ అనేక మంది విమర్శలు చేశారు. దేశం కోసం ఆడుతున్నప్పుడు కొంచెమైనా బాధ్యతతో మెలగాలని హితబోధ చేశారు. ఇక అదే సమయంలో జట్టు కూడా వరస పరాజయాలతో ఉండటంతో విరాట్ కొహ్లీ అనుష్కశర్మను ఇండియాను పంపేశాడు. మరి ఆ తర్వాత వీరి కథ ఏమైందో ఎవరికీ పట్టలేదు. విరాట్ ను తను పెళ్లి చేసుకొవడం లేదు అని అనుష్కా శర్మ స్పష్టం చేయడం మాత్రం హైలెట్ అయ్యింది. మరి ప్రస్తుతానికి వస్తే... వీరి సహజీవనం ఇప్పుడు కూడా కొనసాగుతోందట. ఇంగ్లండ్ టూర్ ముగించుకు వచ్చిన విరాట్ ఎంచక్కా అనుష్కతో కాపురం పెట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. విదేశంలో సహజీవనం ద్వారా వీరి బంధం గురించి అందరికీ తెలిసిపోయింది. అయినప్పటికీ ఎలాంటి సంకోచం లేకుండా హ్యాపీగా గడిపేస్తున్నారట ఈ క్రికెటర్ , హీరోయిన్! మరి పెళ్లి అంటే... అలాంటిదేమీ లేదంటున్నారు. స్వయంగా అనుష్క ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేకుండా ఇలా బంధాన్ని కొనసాగించేస్తున్న వీళ్ల భవిష్యత్తు ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: