ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని వాడుకుంటూ మేడ్ ఇన్ ఆంద్రప్రదేశ్ నినాదాన్ని ఇచ్చి ఆంద్రప్రదేశ్ ను తయారీ రంగంలో హబ్ గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని,పారిశ్రామికవేత్తలకు పూర్తి స్థాయిలో సహకరించడం ద్వారా పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేలా చేయాలని ఆయన కోరారు.ఇందుకోసం సింగిల్ విండో వ్యవస్థ ద్వారా డెబ్బైరెండు గంటలలో దరఖాస్తులను క్లియర్ చేయాలని కూడా ఆయన స్పష్టం చేశారు. మూడు సిమెంట్ కర్మాగారాలకు అనుమతులను కూడా ఇచ్చారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే పెట్టుబడుల రాయితీల కింద 1450 కోట్లు ఇవ్వవలసి ఉందని అదికారులు చెప్పగా, బడ్జెట్ లో ఉన్న 350 కోట్లను వాడుకోవాలని చంద్రబాబు సూచించడం విషయం. అంతా బాగానే ఉంది కాని, అసలైన డబ్బు వద్దకు వచ్చేసరికి కాస్త ఇబ్బందిగానే ఉందని అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: