ప్రజాతంత్ర వేదిక (ఆర్‌డీఎఫ్), సీపీఐ (మావోయిస్టు) పార్టీతో పాటు అనుబంధ రైతుకూలీ, కార్మిక, విద్యార్థి సంఘాలపై నిషేధాన్ని పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను 5 వారాల తరువాత తెలంగాణ రాష్ట్రంలో బహిరంగపర్చిన కేసీఆర్ ప్రభుత్వం తన అసలు స్వభావాన్ని బయటపెట్టుకుందని విప్లవ రచయితల సంఘం ఒక ప్రకటనలో శుక్రవారం ఆరోపించింది. ఆగస్టు 21న ఆంధ్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనే టీ సర్కార్ తాజాగా విడుదల చేసిందని విరసం కార్యదర్శి వరలక్ష్మి విస్మయం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభను అడ్డుకొని ప్రజలను భయాందోళనలకు గురిచేసిందన్నారు. మీడియాను పాతరేస్తానని చెబుతున్న కేసీఆర్ రాష్ట్రంలో తాను తప్ప మరెవ్వరూ మాట్లాడకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాస్వామిక ఉద్యమాలకు వేదికగా నిలిచిన ఆర్‌డీఎఫ్‌తో పాటు అన్ని ప్రజాసంఘాలు, మావోయిస్టు పార్టీ పైన నిషేధం ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ, కేసీఆర్, సీపీఐ, telangana, KCR, CPI

మరింత సమాచారం తెలుసుకోండి: