ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలి తను దోషిగా నిర్దారిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు వెలువడిన వెంటనేజనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత బీజేపీ నేత సుబ్రమ ణియం స్వామి చేసిన వ్యాఖ్యలివి. 1996లో జయలలితపై ఈ కేసు వేసింది కూడా ఆయనే. అప్పట్నించి గత పదిహేనుళ్లుగా ఆయన వేసిన పలు పిటిష న్లు ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఆయన వేసిన పిటిషన్లతో అధికారంలో ఉన్న నేతలను ఇరకాటంలో పెట్టిన సందర్భాలు కూడా ఎక్కువే. కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే సీఎం పదవిలో ఉన్నప్పుడు ఆయన చేసిన ఆరోపణలు అప్పట్లో సంచనలం సృష్టించాయి. పలువురు రాజకీయ నాయకు లు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్‌ చేయాల్సిందిగా డాట్‌ను మాజీ ఇంటెలి జెన్స్‌ చీఫ్‌ ఆదేశించనట్టు ఒక లేఖను సుబ్రహ్మణ్య స్వామి విడుదల చేశారు. పర్వవసానంగా సీఎం పదవికి 1988లో రామకృష్ణ హెగ్డే రాజీనామా చేశారు. 1987లో హషింపుర నరమేధంపై జంతర్‌మంతర్‌ ఎదుట వారం రోజులకు పైగా నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసు కస్టడీలో ముస్లిం యువకుల మృతిపై దర్యాప్తు జరిపాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ ఆయన ఈ కేసును కోర్టు ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2008 నవంబర్‌లో 2జీ స్పెక్ట్రమ్‌ కేసుకు సంబంధించి ఎ.రాజాను ప్రాసిక్యూట్‌ చేసేందుకు అనుమతించాలంటూ అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సుబ్రహ్మణ్య స్వామి ఐదు లేఖలు రాశారు. అయినప్పటికీ మన్మోహన్‌ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో ఈ అంశంపై సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యం స్వామి కేసు వేశారు. దీంతో స్పందించిన అత్యున్నత న్యాయస్థానం సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. కమ్యూనికేషన్ల మంత్రి కపిల్‌ సిబ్బల్‌ ప్రమేయం లేకుండా తిరిగి వేలం వేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి స్వామి అప్పట్లో విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సోదరీమణులైన అనుష్క, నాడియాలకు కూడా 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో 6 శాతం ముడుపులు అందాయంటూ కూడా అప్పట్లో స్వామి సంచనల ఆరోపణలు చేశారు. ప్రధాని మన్మోహన్‌కు 2008 జనవరి 15న చిదంబరం రాసిన లేఖను ప్రస్తావిస్తూ చిదంబరంను ప్రాసిక్యూట్‌ చేయాలని సంబంధించి డాక్యుమెంట్లను స్వామి కోర్టుకు సైతం అందజేశారు. తర్వాత క్రమంలో రాజాను అరెస్టు కావడం, సుమారు 15 నెలల పాటు తీహార్‌ జైలులో గడిపి 2012 మే 15న విడుదల కావడం జరిగింది. ఎలక్షన్‌ కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో సోనియాగాంధీ తప్పుడు డిగ్రీని చూపించారంటూ అప్పట్లో స్వామి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీనిపై 2004లో హైకోర్టులో ఆయన కేసు కూడా వేశారు. ఎన్నికల్లో పాల్గొనకుండా సోనియాగాంధీని నిరోధించేందుకు తాను ఈ ఫిర్యాదు చేయలేదని, ఫెనాల్టిd మాత్రం వేయాల్సిందేనని స్వామి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సోనియాగాంధీ సైతం పొరపాటు జరిగినట్టు అంగీకరించడంతో ఆమెకు ఎలాంటి ఫెనాల్టిd విధించకుండానే కోర్టు ఆ కేసును మూసివేస్తూ ఆదేశాలిచ్చింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో అవకతవకలకు పాల్పడ్డారంటూ స్వామి చేసిన ఆరోపణలు సైతం సోనియాగాంధీ, రాహుల్‌ను ఇబ్బంది పెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: