రాష్ట్ర రాజధాని నిర్మాణంపై మన అధికార నేతలు పర్యటనలు చేస్తున్నారు. ఎందుకు ? రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ డబ్బు వృథా చేయడం తప్ప ఏం చేస్తున్నారు ? సింగపూర్లు, మలేషియాలు, చైనాలు ఇలా తిరిగి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి ఇక్కడ మన రాజధానిని నిర్మిస్తారట. వినటానికి ఆశ్చర్యంగా ఉంది. అసలు వాళ్ల భౌగోళిక పరిస్థితులేంటీ.. మన భౌగోళిక పరిస్ధితులేంటీ .. ? తెలిసీ కూడా ఎందుకు పర్యటనలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే ఎంతోమంది మేథావులు ఉన్నారు. అనుభవజ్ఞులూ ఉన్నారు. వాళ్ల సూచనలతో ప్రభుత్వం ముందుకు వెళ్లవచ్చు కదా..! ఎక్కడో విదేశీయులనడిగి మన రాజధానిని నిర్మించుకోవాలా ? ఎంత దుస్థితి. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఇలాగే విదేశాలు తిరిగారా ? ఛత్తీస్ గడ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు వాళ్లు కూడా ఇలానే విదేశీ పర్యటనలు చేశారా ? ఎందుకు బాబు గారు డబ్బులు లేవంటూ ఈ వృథా పర్యటనలు. హైటెక్ సిఎం నని చెప్పుకుంటారు కదా.. ! మరి మీ హైటెక్కులు ఇప్పుడు ఎందుకు ఉపయోగించటం లేదు. ఇప్పటికే మీరు అధికారంలోకి వచ్చి 100రోజులు దాటిపోయింది.  రాజధాని ఎక్కడన్నదానిపైనా మీ దగ్గర స్పష్టత లేదు. ఎలా నిర్మాణం చేయలన్నదానిపైనా అవగాహాన లేదు. ప్రతీదానికి నిపుణుల కమిటీ. వాళ్లేం చేస్తారో తెలియదు. సమయాన్ని వృథా చేయటం తప్ప. ఆంధ్రుల రాజధాని నిర్మాణాన్ని వీలయినంత తర్వగా పూర్తి చేయాలన్న ఆలోచన లేదు. అసలు అన్న క్యాంటీన్లు పెట్టడానికి మంత్రుల కమిటీ తమిళనాడు పర్యటన చేయాలా..? మహిళయి ఉండి కూడా ఎంతో ఆలోచనతో తమిళనాడు సిఎం అమ్మ క్యాంటీన్లు పెట్టింది. అందుకు జయలలిత రాష్ట్రాలు తిరిగిందా..? పథకం వల్ల లబ్దిదారులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ప్రభుత్వానికి ఎంత వ్యయం అవుతుంది , దాన్ని ఎలా రాబట్టాలి అని ఆలోచించిదే తప్ప ఎక్కడకు తిరగలేదు. మన మంత్రులకు ఆ మాత్రం అనుభవం కూడా లేకపోతే ఎలా ..? అసలు ఆంధ్ర అభివృద్ధి కన్నా మంత్రులు పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఆశలతో ఈ హైటెక్ -పొలిటీషన్ కు అధికారం కట్టబెడితే … పర్యటనలు తప్ప పని చేసేటట్లు కనిపించటం లేదు. ఇక మన రాజధాని పదేళ్లు కాదు వందేళ్లైనా పూర్తి కాదేమో ! 

మరింత సమాచారం తెలుసుకోండి: